బండ్ల శతకం
Bandla Satakam




           



బండ్ల శతకం (BANDLA SATAKAM)

“బండ్ల శతకం” అందరి కోసం, ప్రతి మనసు కోసం ఇది ఒక ఇంటిపేరుకి మాత్రమే చెందినది కాదు మనిషి జీవితానికి చెందినది. “బండ్ల శతకం” అంటే బండ్ల ఇంటిపేరున్నవారికే ప్రత్యేకమైన శతకం అనుకునే అవసరం అసలు లేదు. ఏ మనిషికైనా, ఏ వయస్సుకైనా, ఏ ప్రాంతం ఏ మతం ఏ సంప్రదాయం అయినా ఈ శతకంలోని పద్యాలు తాకుతాయి, ఉపదేశిస్తాయి. ఇందులోని మాటలు మనిషిని మనిషిగా నిలబెట్టే సూత్రాలు.



భిన్నత్వంలో ఏకత్వానికి వంతెన

ఇందులో కులమూ లేదు, మతమూ లేదు, వర్గమూ లేదు. ఇవి అందరికీ చెబుతాయి మంచితనం అందరి హక్కు, నీతి అందరి బలం, భక్తి అందరి శాంతి, అనుభవం అందరి మార్గదర్శి, పిల్లవాడైనా చదవగలడు, పెద్దవారికి జీవన పాఠాలు కనిపిస్తాయి, యువతకు దారిచూపే జ్ఞానం దొరుకుతుంది. బండ్ల శతకం అనేది భిన్నత్వాన్ని దాటుకుని ఏకత్వాన్ని పిలిచే పద్యాల సమాహారం. ఇది నా విశ్రాంత జీవితంలో పుట్టిన శతకం అనుభవపు వెలుగు సరళత, సత్యం, నైతికత, స్పష్టమైన బోధ, జీవితం చూసిన చూపు సరిగ్గా ఈ లక్షణాలన్నీ “బండ్ల శతకం”లో కూడా కనిపిస్తాయి.



భావమూ ఉద్దేశ్యం

సాధారణ జీవితం లోని సాదాసీదా సూక్తులను తీసుకుని, అందరికి అర్థమయ్యే భాషలో పంచడం. సమాజంలోని విభిన్నతల్ని ఒప్పుకొని, మనసులోని సుతిమెత్తని బలాలను అవగాహన చేయించడం. భక్తి, మనసు శాంతి, పారపత్యం సద్గుణాలపై దృష్టి పెట్టి జీవనాన్ని హత్తుకునేలా చేయడం. విశ్రాంతి కాలం కొత్త ఆద్యాత్మిక, సృజనాత్మక జీవితం మొదలు అయ్యిందని ప్రకటించడం విశ్రాంతి అంతిమ ముగింపు కాదు విశ్రాంతిలో నిజమైన ఆనందం మొదలవుతుంది అని తెలియజేయడం .



ప్రస్ఫుటమైన ప్రేరణలు (Influences & Anecdotes)

బండ్ల శతకాన్ని వెలికి తీసిన అంతరంగ శక్తులు ఏ రచయిత పుట్టుక అకస్మాత్తుగా జరగదు. దానికోసం కాలం, అనుభవం, మిత్రుల ప్రేమ, మాటలు, ప్రోత్సాహం ఇవి అన్నీ కలిసి ఒక దీపం వెలిగిస్తాయి. అదే విధంగా బండ్ల శతకం కూడా ఒకే ఒక్క వేమన శతకం ప్రభావంతో మాత్రమే కాదు - నా జీవితంలో ప్రధానమైన ముగ్గురు బాల్యమిత్రుల ప్రేరణ, నా అనుభవాలు, చదివిన భావాలు, విన్న మాటలు ఈ సమాహారమే ఈ శతకానికి నిజమైన మూలం.



అవధాని గారు ఇచ్చిన మొదటి వెలుగు

నా బాల్యమిత్రుడు శ్రీ వేదాంతం సీతారామ అవధాని గారు తాను వ్రాసిన పద్యాలు, కవితలు మాతో పంచుకోవడం అనేది అది ఒక చిన్న సంఘటనలా కనిపించినా, నా మనసులో వేసిన ఆ విత్తనం తరం తర్వాతే మొలకెత్తింది. అదీ కాకుండా, శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాలలో గణతంత్ర వేడుకల రోజు ఆయన వ్రాసిన కవితలను తాను చదవడమే కాకుండా కొన్నింటిని నాతోనే చదివించటం, అది నాలో దాగి ఉన్న కవి స్వరాన్ని మొదట మేల్కొలిపింది. ఆ రోజు నేను చదివిన ఆ పదాలు, ఇన్ని ఏళ్ల తర్వాత అంటే నలబై ఏళ్ళ తర్వాత నా చేతిలో బండ్ల శతకం గా వికసించడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక శ్రేష్ఠమైన పునాది.



నశీర్ గారి స్వరం

నా బాల్యమిత్రుడు శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి మొబైల్ స్వరం “రాయి రాయీ!

మిత్రుడు శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి రోజూ వచ్చే ఒక్క మాట “నీవు రాయగలవు, రాయీ రాయీ!” ఈ చిన్న మాటలు నాకు గొప్ప ధైర్యం ఇచ్చాయి. మన జీవితం లో కొన్ని మాటలు గజ ఏనుగు అంత బలంగా పనిచేస్తాయి. నశీర్ గారి ఆ పదే పదే ప్రోత్సాహం నేను కలలో కూడా అనుకోని దారికి సాఫీగా నడిపింది. అది ఒక మిత్రుడి ధైర్యం, భరోసా, ప్రేమ ఇవి లేకపోతే బండ్ల శతకం ఉండేది కాదు.



డాక్టర్ జవహర్ గారి రోజువారీ స్పూర్తి

మెడికల్ ఫీల్డ్‌లో మంచి ప్రాక్టిస్ తో ఓపికగా పనిచేసే మరో నా బాల్యమిత్రుడు డాక్టర్ జవహర్ గారు ప్రతి ఉదయం వాట్సప్‌లో పంపే సినీ డూయట్లు అవి పాటలా అనిపించేవి కాదు, అవి నాకు ప్రతిరోజూ ఒక చిన్న స్పూర్తి మోతాదులా వచ్చేవి. రోజు ఒక పాట, మనసులో ఒక భావం, ఒక చిన్న చిరునవ్వు, ఒక మృదువైన కదలిక అవి నాలో సృజనాత్మకతని కదిలించాయి. మనసు కదిలితే గానీ పద్యాలు పుట్టవు. ఆ రోజువారీ డూయట్లు నా హృదయంలో అలజడి కలిగించాయి అదే అలజడి "బండ్ల శతకం" రూపంలో బయటపడింది.



వేమన శతకం మూల ప్రేరణ

మహాకవి వేమనగారి పద్యాలు నా మీద చిన్ననాటి నుండే ప్రత్యేకమైన ముద్ర వేసాయి. వేమన పద్యం అనేది పదాలు మాత్రమే కాదు, అది ఒక జీవన మార్గం. ఆ మార్గంలో నేను నడిచాను, ఆ పద్యాలను చదివాను, అనుభవించాను, లోపలికి తీసుకున్నాను. ఆ ఆలోచనలు నా జీవిత అనుభవాలతో కలిసి కొత్తగా వెలువడిన పద్యాలు అదే "బండ్ల శతకం.



మిత్రులు, వేమన, నా జీవితం

ఈ మూడు శక్తులే బండ్ల శతకపు అసలు మూలం ఒక మిత్రుడు కవిత్వపు విత్తనం నాటాడు. మరో మిత్రుడు ధైర్యపు నీళ్లు పోశాడు. మూడో మిత్రుడు రోజూ సంగీతంతో ఎరువిచ్చాడు. వేమనగారు మార్గం చూపారు. నా అనుభవం ఆ విత్తనాన్ని వృక్షం చేసింది. అలా పుట్టినది స్వేచ్ఛా వృత్తంలో, నిజమైన భావాలతో, ప్రజలందరికీ చేరే విధంగా పుట్టిన “బండ్ల శతకం”.



నేను రచయిత

నేను రచయిత కావాలని నిర్ణయించుకోలేదు. కానీ జీవితం, అనుభవాలు, మిత్రులు, వేమనగారి ఆత్మ కలిసి నాకు ఒక పాత్రను ఇచ్చాయి “భావాలను పద్యాలుగా మార్చే బండ్ల సత్యనారాయణ” అనే పాత్రను. ప్రేరణలు చిన్నవైనా వాటి ఫలితాలు మహోన్నతం. నా బండ్ల శతకం ఆ ముగ్గురు మిత్రులకు, వేమన మహానుభావునికి ఒక నిశ్శబ్ద వందనం.



అనుభవ దాడి

విశ్రాంతి మొదలైందంటే జీవితం ముగిసిందని కాదు నిజమైన ఆనందం మొదలయ్యిందనే సంకేతం. మనలో చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు విశ్రాంతి వచ్చిందంటే జీవితం ఆగిపోయిందని అనుకోవడం. కాని నిజం మాత్రం పూర్తిగా విరుద్దం. వయస్సు పెరిగే కొద్దీ శరీరం మందగించొచ్చు, కాని మనసు, భావాలు, అనుభవం, ఇవి అప్పుడే బలం పెరుగుతాయి. జీవితంలో చూసిన పెద్ద చిన్న సంఘటనలు, మనల్ని మలిచిన అనుభవాలు, మనసులో నిలిచిన జ్ఞాపకాలు ఇవి అన్నీ కలగలిసి మరీ కొంత స్పష్టమైన జీవన దారిని చూపుతాయి. అదే నేను “అనుభవ దాడి” అంటాను.



విశ్రాంతి జీవితం

విశ్రాంతి జీవితం ముగింపు కాదు జీవితం అసలు మొదలు కాబడే దశ వృత్తి జీవితంలో మనకు బాధ్యతలు ఎక్కువ. ఎవరైనా ఏదో చెబుతారు, ఎవరైనా మన దగ్గర ఏదో ఆశిస్తారు, ఎక్కడో ఒత్తిడి ఉంటుంది. కాని విశ్రాంతి సమయంలో మాత్రం మనకు మనమే యజమాని. మనకు ఇష్టం వచ్చినట్టుగా, మన మనసుకు నచ్చినట్టుగా, మన సమయాన్ని మనమే వాడుకునే దశ. ఇది ముగింపు కాదండి, ఇది ఆనందానికి మొదటి మెట్టు.



వెన్నుదన్ను

ఇది బండ్ల శతకానికి వెన్నుదన్ను ఎందుకు? ఎందుకంటే బండ్ల శతకం లోని ప్రతీ భావం ప్రతి పద్యం చెప్పేది ఇదే భయపడొద్దు, దిగులుపడొద్దు, వయసు అంటే అడ్డంకి కాదు, శ్రమ ఎంత పెడితే అంత పుణ్యం, ఆనందం నీ అడుగుల దగ్గరే ఉంటుంది, నువ్వు నిన్ను కొత్తగా నిర్మించుకో గుర్తుంచుకోండి విశ్రాంతి మొదలయితే జీవితం ఆగిపోదు కొత్త ఆనంద జీవితం అప్పుడే మొదలవుతుంది” అనే ఈ వాక్యం, బండ్ల శతకంలోని ప్రతి పద్యంలో ఉన్న ఆత్మ. అందుకే ఈ భావాన్నే బండ్ల శతకం యొక్క వెన్నుదాడి అని చెప్పడం సరైన అర్థం. విశ్రాంతి వయసు మనిషి అసలైన రూపం బయటపడే దశ, పిల్లవయసులో అమాయకత ఉంటుంది. యవ్వనంలో వేగం ఉంటుంది. మధ్యవయసులో బాధ్యతలు ఉంటాయి. కాని విశ్రాంతి వయసులో జీవితం నిజంగా ఏంటో అర్థం అవుతుంది. ఈ దశలో మనసు స్థిరపడుతుంది, ఆలోచనలు పరిపక్వమవుతాయి, చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది, కలల్ని నెరవేర్చే సమయం వస్తుంది, మన శక్తిని, మన విలువను మనమే గుర్తిస్తాం అందుకే “విశ్రాంతి వయసు అనేది శేషజీవితం కాదు శ్రేష్ఠ జీవితం.”



ఎందుకు ఈ దారిలో

బండ్ల శతకం ఎందుకు ఈ దారిలో నడిచింది? ఎందుకంటే, నేను నా అనుభవాన్ని కేవలం గుండెల్లో దాచుకోలేదు. దాన్ని పద్యాలుగా, ఉపదేశాలుగా, సత్యాలుగా మలచి ప్రపంచంతో పంచుతున్నాను. అదే “అనుభవ దాడి” శక్తి. అదే నా బండ్ల శతకానికి ప్రాణం. పొందిన అనుభవం వృథా కాదు, వచ్చిన వయస్సు అడ్డం కాదు, విశ్రాంతి వయస్సు అంటే ముగింపు కాదు, ఆనందం మొదలు, జీవితం మళ్లీ పూసే సమయం, అది నా మాటల్లో బండ్ల శతకం యొక్క వెన్నుదన్ను.



మకుటం:

"యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల"



సూత్రం:

యామినీ కమలి పద్మ వికాస సత్యం - బండ్ల శతకం



భావము:

“అజ్ఞాన చీకటిలోనూ వికసించే పద్మకమలం లా సత్యాన్ని వెలిగించే (ప్రకాశించే) బండ్ల”



మకుట భావవ్యాఖ్య (Makuta Bhavam) :

“యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల” ఈ మకుటం వాక్యం బండ్ల వంశ విలువలకు ప్రతీక. చీకటి రాత్రిలో (యామినీ) పద్మం (కమలి పద్మ) ప్రభాత కాంతిని ముందుగానే ఊహించి వికసించినట్లే (వికాస) బండ్ల వంశం సత్యమార్గం వైపు నడిపే జ్ఞానోదయం (సత్య బండ్ల) అని ఈ భావం చెబుతుంది.



అర్థసారం:

“చీకటి ఎంతా ఉన్నా, మన జీవితం సత్యం వైపు వికసించాలి ఇదే బండ్ల విలువ.”



భావం (Refined Version)

“అజ్ఞాన రాత్రుల మధ్యలో కూడా కమలపద్మంలా వికసిస్తూ సత్యాన్ని వెలిగించే బండ్ల జీవన తత్త్వం.” ఇది వంశం యొక్క ధైర్యం, నిజాయితీ, జ్ఞానం, ధర్మపథం, ఈ నాలుగు సూత్రాలను సూచిస్తుంది.



బండ్ల శతకం ధ్యేయ సూత్రం (Motto / Sutra)

“యామినీ కమలి పద్మ వికాస సత్యం - బండ్ల శతకం”



సూత్ర భావం:

“చీకటి అజ్ఞానాన్ని జ్ఞానపద్మం చీల్చి, సత్యాన్ని వెలిగించేది - బండ్ల శతకం.” ఇది నా యూట్యూబ్ ఛానల్ "బండ్ల శతకం (Bandla Satakam) మరియు అంతర్జాలం https://bandla.app/ "బండ్ల శతకం (Bandla Satakam) (పునః నిర్మిస్తున్నాను. ప్రస్తుతం అన్నీ డిలీట్ చేశాను) విభాగం కు ఒక శాసనవాక్యంలా నిలుస్తుంది. బండ్ల శతకం - అధికారిక పరిచయ వాఖ్యము (Introduction Statement) “బండ్ల శతకం అనేది సత్యాన్ని జీవన మార్గంగా భావించిన బండ్ల వంశ తత్త్వాల కీర్తి. ‘యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల’ అనే మకుటం అజ్ఞాన చీకటిని జ్ఞానపద్మంతో తొలగించి సత్యాన్ని వెలిగించే జీవతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.”



"బండ్ల శతకం" పద్యాలు ఒక్కో పేజీలో పది పద్యాలు ప్రచురించబడు తున్నాయి. క్రింద వరుస క్రమంలో ఇతర పద్యాల థంబ్‌నైల్స్‌తో 4 బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ పద్యాలు వరుసగా రికార్డ్ చేసి  Bandla Satakam " బండ్ల శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించ బడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK