బండ్ల శతకం
Bandla Satakam




           





పద్యము 1
తీర్చని ఋణమె తల్లిదొరగు బండ్ల కోటమ్మ
నిరంతర సేవలతో నడిపిన పయనము
శ్రమించి మలచిన భవితను తీర్చిన మమత
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
తల్లి పాత్ర జీవన మౌలికశిల. ఆమె నిరంతర సేవల వల్లే మన భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. మా అమ్మ కోటమ్మ తల్లి అందించిన ఆదరణ, వల్లే నా లక్ష్యాలు సాకారమయ్యాయి. తల్లి మమత, ప్రేమ, శ్రమ నిరంతర సేవల ద్వారా మన భవిష్యత్తు నిర్మాణం చేస్తుంది. మా అమ్మ బండ్ల కోటమ్మ ఋణం తీర్చలేనిది. అని ఈ పద్య భావము.



పద్యము 2
తండ్రి శ్రమ హేమమయ పునాదిగా నిలిచినది
సంఘర్షణ పటుత్వమునకు నీడగా మారినది
బండ్ల రామయ్య జీవితం వెలుగుల దీపమై
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
తండ్రి జీవితం అంటే బాధ్యత, బలమైన మనఃస్థైర్యం. ఆ ధైర్యాన్ని పిల్లలకు మార్గంగా మలిచేవాడు నాన్న. తండ్రి కృషి, నిబద్ధత మనకు బలమైన మార్గదర్శకంగా నిలుస్తుంది. మా నాన్న శ్రీ బండ్ల రామయ్య గారి జీవితశైలి మా కుటుంబ నిర్మాణానికి ఆదర్శం అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 3
ఆదికాల జ్ఞానకిరణం ఆచార్యుని చేతిలో
అక్షర బీజము నాటిన శ్రీ విశ్వరూపాచారి
ప్రథమ బోధకునికి ప్రణామములతో
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
ప్రాధమిక గురువు విద్యకు పునాదివేస్తారు. ప్రపంచాన్ని చూసే కళ్ళు నేర్పేది గురువు. విశ్వరూపాచారి గారు విద్యార్ధిగా మారిపోయే మార్గాన్ని తెరిచినవారు. గురువు అనేది జ్ఞానానికి మార్గం. శ్రీ విశ్వరూపాచారి గారు విద్యాబుద్ధుల తొలిపాఠం నేర్పిన ప్రథమ గురువు. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 4
వినాయకుని వందనమే మొదటి అడుగు సత్యమవును
విఘ్నములు తొలగించే వాఘవుడు ఆశ్రయమవును
గణపతి ప్రసాదమే విజయానికి మూలమవును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
గణపతి దేవుని ఆశీస్సు లేకుండానే ముందడుగు సార్థకం కాదు. అతని పేరుతో ప్రారంభం విజయం దిశగా నడిపిస్తుంది. ఆరాధ్యదైవమైన గణపతి, ప్రతీ కార్యారంభానికి శుభకారకం. శ్రీ గణపతి దేవుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి విజయ మార్గం సులభమవుతుంది అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 5
అమ్మ కన్నతనములోన పసితనపు బాటలు,
నాన్న చూపిన చేతిలో జీవన పాఠములు,
గురువు, దైవం, స్నేహితుల స్ఫూర్తి వెలుగులు,
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
ఈ పద్యం చెప్పేది జీవితంలో పొందిన ప్రతి విలువ, ప్రతి మార్గదర్శకత్వం ఒక వరం. తల్లిప్రీతి మనసును మృదువుగా చేస్తుంది, తండ్రి శ్రమ బలం ఇస్తుంది. గురువు జ్ఞానదీపం వెలిగిస్తారు, దైవం ధైర్యం ఇస్తుంది, స్నేహితులు ప్రోత్సాహం అందిస్తారు. ఇవి అన్నీ కలిసినపుడే నిజమైన “శతక సారాంశం” నిలుస్తుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 6
వేదాంతం మాటల వెనుక మంత్రాల మెలిక
తన చూపుల తాకిడిలో భావాల వెలుగు
అవధాని ప్రేరణతొ పుట్టినవే నాయీ పదాలు
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
కొందరు మిత్రులు మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తారు బాల్య మిత్రుడు అవధావి గారి మాటల్లో, ప్రేరణలో నేను, నేను కాదు – పదాలు అవుతున్నాను. ఆయన చూపు నాలోని కవిత్వాన్ని నడిపించింది . అవధావి గారి స్నేహం, మాటలు, హోరుముఖం నాకు కవిత్వశక్తిగా మారాయి అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 7
తన ఊసులో ఊపిరిలా పాడిన సాహసం
చూపుల్లోన ప్రోత్సాహమే అభినయంగా
బండ్ల శతకానికి నశీర్ ఓ శక్తిదాయక తాంబూరా
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
బయట మాట్లాడే మాటల కన్నా, నిశ్శబ్దంగా మద్దతుగా నిలిచే వాళ్లే నిజమైన మిత్రులు. బాల్య మిత్రుడు నశీర్ వంటి స్నేహితుడు ప్రోత్సాహాన్ని సంగీతంగా నింపి బండ్ల శతకానికి మూలస్వరంగా నిలిచాడు . నశీర్ ప్రోత్సాహం వల్లే ఈ శతకం ఊపిరి పోసుకుంది అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 8
డాక్టర్ జవహర్ మిత్రుని జ్ఞాన గాన నినాదము
బండ్ల శతకం ఉద్వేగానికి ప్రేరణ గ నిలిచెను
నిత్య వాట్సప్ మెలోడీ పాటల విందులతో
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
ఈ పద్య భావం స్నేహితుడు పంపే చిన్న సందేశం, చిన్న పాట కూడా పెద్ద ప్రేరణగా మారొచ్చు. డాక్టర్ జవహర్ పంపే మెలోడీలు నా హృదయంలో భావాల్ని మేల్కొలిపి, బండ్ల శతకానికి ఉత్సాహం, ఊపిరి ఇచ్చాయి. సంగీతమే కవిత్వానికి నడకను అందించిందని డాక్టర్ జవహర్ మిత్రుని సంగీత సందేశాలు ప్రతి రోజు మానసిక స్పూర్తి నిచ్చి, బండ్ల శతకం పద్య రాతలకు ప్రేరణ గ నిలిచెను అని భావము



పద్యము 9
తిరుమల వాసుడే మా ఇంటి లోకనాధుడు
సంకల్పించినదంతా ఆయన అనుగ్రహమే,
గుండె గదిలో తలదాచినది శ్రీనివాసుడే,
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
శ్రీనివాసుడి పై విశ్వాసం గౌరవంగా కాదు జీవన ధారాగతంగా ఉంది. ఆయన్ని కుటుంబంలో తలచడం శుభాశయానికే కాదు, చైతన్యానికి మూలంగా మారుతుంది. అలాంటి భక్తి ఇంటిని దేవాలయంగా మార్చుతుంది మా ఇంట్లో ధర్మానికి, దైవతత్వానికి ప్రతీక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆయన కృపే ప్రతి అడుగుకు ఆధారము అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 10
జీవితం బోధించె గెలుపు ఓటముల కౌగిలి,
చిన్ననాటి ప్రయోగాలే పెద్ద గమ్యమవుట,
ఫలితం కన్నా పయనమే గొప్పదయ్యె,
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
విజయం ఒకే దారిలో రాకపోవచ్చు. తప్పుల నుంచే పాఠాలు, ఆ పాఠాల నుంచే ప్రగతి. నా జీవితం అదే నిదర్శనం జీవితం పాఠశాల — ప్రయోగాలద్వారా విజయం రావొచ్చు అని ఈ బండ్ల శతకం పద్య భావం .



"బండ్ల శతకం" పద్యాలు ఒక్కో పేజీలో పది పద్యాలు ప్రచురించబడు తున్నాయి. క్రింద వరుస క్రమంలో ఇతర పద్యాల థంబ్‌నైల్స్‌తో 4 బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ పద్యాలు వరుసగా రికార్డ్ చేసి  Bandla Satakam " బండ్ల శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించ బడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK