ప్రారంభం మొదటి అడుగుతో ఆరంభం
ప్రతి ప్రారంభం మొదటి అడుగుతో ఆరంభమవుతుంది. అంతర్జాల నిర్మాణంలో నా మొదటి అడుగు satyanarayana.com తో ప్రారంభమయింది తప్పటడుగులతో 2004 వ సంవత్సరం నవంబర్ 18 వ తేదీ నుండి. అంటే అంతర్జాలం విస్తరిస్తున్న తొలి రోజులలోనే నాలో చిగురించిన ఓ ఆశయం నేనూ ఒక వెబ్ సైట్ నిర్మించు కోవాలి అని, వెంటనే satyanarayana.com ను New Delhi లోని Net4India Limited అను Domain provider and hosting సంస్థలో రిజిస్టర్ చేసుకొని ప్రారంభించాను. అంచెలంచలుగా డెవలప్ చేసుకుంటూ శైశవ స్థాయి నుండి మొగ్గ స్తాయిలోకి ప్రవేశించిన తరుణంలో, నేను నా డొమైన్ ను రిజిష్టర్ చేసుకున్న సంస్థ, Net4India Limited https://www.net4.in/ , https://www.net4.com/ అర్ధంతరంగా ఒక సంవత్సరం క్రితం అంటే, 2021 వ సంవత్సరం జనవరి నెలలో మూతబడడంతో దానితో పాటు నా వెబ్ సైట్ satyanarayana.com రద్దయింది, గల్లంతయ్యింది, కనుమరుగయింది.