బండ్ల శతకం
Bandla Satakam




           





పద్యము 11
స్నేహమునందు సేవ చూపు సద్గుణంబు
ఆరోగ్య దుఃఖమున నివారింప వొంగు నంబు
ప్రీతి గల గజ్జల బ్రహ్మారెడ్డి మాట పరమ మందు
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
స్నేహితుని ప్రేమ, పరామర్శ, ఆరోగ్యంపై చూపే శ్రద్ధ వాటన్నింటినీ అమూల్యమైన ఔషధంగా ఈ పద్యం వ్యక్తం చేస్తుంది. గజ్జల బ్రహ్మారెడ్డి గారి మాటలు వైద్య జ్ఞానమే కాక హృదయపూర్వకతను కలిగి, కష్టకాలంలో మనసుకు ధైర్యం నూరుస్తాయి. సత్పాత్రుడైన మిత్రుని విలువను పద్యం చాటుతుంది.


పద్యము 12
అరే ఒరే పలుకునందు ఆత్మ స్నేహ మాధుర్యము
పట్టాభిరావు పిలుపులో పాత బంధ మాధనము
హృదయమునేల చిరస్థాయిగ నిలిచిన సౌహార్దము
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
పట్టాభి రామారావు గారి పిలుపులో కనిపించే ఆప్యాయత చిన్ననాటి స్నేహపు శిఖరాన్ని సూచిస్తుంది. ఆ పిలుపు వెనుక ఉన్న ప్రేమ, నైతికగుణం, సరదా, నమ్మకం అనేవి బాల్య మైత్రీకి చిహ్నాలు. కాలానుగుణంగా రూపాలు మారినా ఆ బంధములోని తీపి, వేడి ఎప్పటికీ చెదరని మాణిక్యం అని పద్యం చెబుతుంది.



పద్యము 13
దేవాలయాల సందర్శన నా ఆత్మవేదన,
భక్తి భావనలు పంచటం నా ఆనంద ధర్మం,
నాలో వెలసే దైవమే పంచుకునే కర్తవ్యము,
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
ఆధ్యాత్మికత బోధించేది కాదు; పంచుకునే అనుభవం. దైవానుభూతిని లోపల నిలువచేసుకోకుండా ఇతరులకు పంచినపుడే అది పూర్తవుతుంది. ఆలయాల సందర్శన అంతరశాంతి, ఆ శాంతిని పంచడం ఆనందధర్మం. భక్తి అనేది హృదయ స్పందనే అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 14
ఎదురు చెప్పిన మాటలోన లేదు దూరము
పోటీలోన ప్రేమ, మందలింపుల్లో మమకారం
భుజం తట్టి వెలిగించు మిత్రుని అనురాగము
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
నిజమైన మిత్రుడు మన తప్పును కప్పిపుచ్చడు చెబుతాడు. ఎందుకంటే మనం ఎదగాలి కాబట్టి. అలాంటి హెచ్చరికలు మధురమైన మలుపులు. తప్పు చేసినప్పుడు మిత్రుడు తిడితే – అది ద్వేషం కాదు, నమ్మకమే అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 15
కపటపు కిరీటం కాస్త మోజుకే గలదు
నిజము నిగూఢమైతే మౌనంగా వెలుగును
కాటుకలో నాణ్యత గలవే నిలుచును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
అబద్ధం త్వరగా ఆకర్షణ పొందినా, దాని జీవితం తాత్కాలికం. నిజం నిశ్శబ్దంగా నిలబడుతుంది, చివరికి విజయం సాధిస్తుంది. గుణంలో నాణ్యత ఉన్నవారే కాలపరిమాణాన్ని తట్టుకుంటారు. సత్యమే శాశ్వతం, కపటం కేవలం భ్రమ మాత్రమే అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 16
దుర్మార్గమార్గంలో దారితప్పినదీ జయమేనా?
సత్యమార్గంలో నడిచిన గమ్యమే శాశ్వతము
బాధలకన్నా నిలకడ జీవుని గెలిపించును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
అన్యాయంగా వచ్చిన గెలుపు జయంలా కనిపించినా, దానికి విలువ ఉండదు. సత్యపథంలో నడిచే వాడికి కష్టాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, కానీ విజయమే చివరి ఫలితం. నిలకడ, ధైర్యం, సత్యనిష్ఠే అసలైన ఆధారం అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 17
చదివే ముఖం కలిగి చలిమి లేని వాడు
నలుపు లోపల దాచి, తెలుపైన మాటలతో
నిజం నిర్లక్షించబడినా నీడలలో మెరియును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
మంచితనం నాటకం కాదు. అది సజీవ సత్యం. అసలైన స్వభావం వెలుగులోకి వస్తుంది. చక్కటి మాటలు ఉండొచ్చు, కానీ హృదయం నిస్సారంగా ఉంటే — ఆ నిజం బయటపడుతుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 18
కల్మషపు లోకములో స్వచ్ఛతె కష్టమైనా
సత్యము మెదిలిన చోటే శాంతి నిలుచును
తప్పుల చీకటిలో దీపమే నిజమై వెలుగును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
సత్యం ఎక్కడ మెదిలితే అక్కడ శాంతి సహజంగా స్థిరపడుతుంది. తప్పుల చీకటిలో సత్యమే దీపమై వెలుగుతుంది. ఒంటరిగా ఉన్నా నిజం తన ప్రభావాన్ని కోల్పోదు. ధైర్యంగా సత్యాన్ని ఆచరించిన వ్యక్తి సమాజ గమనాన్నే మార్చగలడు. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 19
కన్ను మూసినదే కాపాడుతుందని నమ్మవద్దు
సత్యాన్ని కప్పినా, అది చిలకరించును నెమ్మదిగ
నీతి ఆడిన ఆట ఎప్పటికీ నిలిచును శాశ్వతంగ
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు తాత్కాలికం. ఎంతగా దాచినా, అది నెమ్మదిగా బయల్పడుతుంది. అబద్ధం చల్లగా మెరుస్తున్నా, నిలిచేది మాత్రం ధర్మం. ఒక సత్యమే నిలబడగలిగితే, అబద్ధాల గోడలు అన్నీ కూలిపోతాయి అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 20
శంభో శంకరా అనగానే శాంతి కలుగును
హర హర నినాదములో హృదయ హారతి వెలుగును
మనస్సు విముక్తమవగ మార్గ క్రాంతి శివస్మరణము
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
శివుని నామస్మరణ అంతరంగానికి హారతిలాంటి వెలుగు. హరుని నామం పలికితే బాధలు, భయాలు కరిగిపోతాయి. శివస్మరణే విముక్తికి మార్గం. మనసు ప్రశాంతమై ధైర్యంతో నిండుతుంది. శివుని కరుణ మనసుని మలచుతుందని ఈ బండ్ల శతకం పద్య భావం .



"బండ్ల శతకం" పద్యాలు ఒక్కో పేజీలో పది పద్యాలు ప్రచురించబడు తున్నాయి. క్రింద వరుస క్రమంలో ఇతర పద్యాల థంబ్‌నైల్స్‌తో 4 బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ పద్యాలు వరుసగా రికార్డ్ చేసి  Bandla Satakam " బండ్ల శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించ బడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK