బండ్ల శతకం
Bandla Satakam




           





పద్యము 21
రుద్రుని రాగములలో రుద్రమంతా వెలుగును
అయ్యప్పదృక్సంపుటి లోని ఆవేశమే ధ్యానమవును
బాహ్య తపస్సుకు లోపల తేజస్సే రుజువగును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
రుద్రుని రూపాల్లో భక్తి స్నేహాన్ని, తపస్సులోని తాపాన్ని చూపుతుంది. ఆవేశపు లోతులో కూడా శాంతి ఉంటుంది అదే రుద్రుని రాగాల విశిష్టత. శివుడు రౌద్ర స్వరూపుడైనా, ఆవేశమే లోనికి మార్గం. ధ్యానంలో దైవభావమే శక్తి. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 22
మహాలక్ష్మి కృప లేక సృష్టించలేరు సంపదను
ధనం తోడు కాదని ధర్మమునే రక్షించును
సద్గుణాల పునాది లేనిదే శ్రీవిభూతి శూన్యము
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
మహాలక్ష్మి కృప లేక సంపద స్థిరంగా ఉండదు. ధనం తాత్కాలికం, ధర్మమే రక్షకుడు. సద్గుణాల ఆధారం లేని సంపద శూన్యం. గర్వించడానికి కాదు, గౌరవించడానికి తగినది ధనం. ఆధ్యాత్మిక సంపద ఉన్నచోటే అసలైన శ్రీ విభూతి నిలుస్తుందని అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 23
నారాయణ నామమనే నాభిమూలముగల నదీ
నడుస్తున్న ప్రతి పయనానికీ సాగరానిది
శ్రద్ధగా పలికిన నామమే మోక్షమునిచ్చునదీ
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
నారాయణ నామం అనేది ఎన్నటికీ ఎండిపోని ఆధ్యాత్మిక ప్రవాహం. మన ప్రయాణం ఎక్కడికి వెళ్లినా, ఆ నామమే మనకు అంతరంగ సాగరంగా నిలుస్తుంది. శ్రద్ధతో పలికిన నామం మనసుని శుద్ధిపరచి, మోక్షానికి దారి చూపుతుందని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 24
వేంకటేశుని రూపమే విభావరిలో వెలుగును
సుప్రభాతంలో శ్రీవారి కాంతి సాక్షాత్కరించును
వేగంగ నిద్రలేచినవారికి శాంతి లభించును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
వేంకటేశ్వరుని సుప్రభాత సేవతోనే ఉదయం ప్రకాశిస్తుంది. ఆ భక్తితోనే జీవితం వెలిగుతుంది. వేగంగా లేచి వేంకటేశుని బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తే దినం క్షేమంగా, ధర్మంగా సాగుతుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 25
పఠనమున పట్టు పట్టి శ్రద్ధతో చదివినవాడు
పదవుల పర్వతములు అధిరోహించగలడు
సత్య మార్గమున నడచి శ్రమించు విద్యార్థి
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
విద్యార్థి ఏకాగ్రతతో పఠనం చేస్తూ, మధ్యలో నిరుత్సాహానికి లోనుకాకుండా శ్రమిస్తే, పదవుల వంటి ఉన్నత స్థానాలను సాధించగలడు. సత్య మార్గంలో నడవడం అతని విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చదువు, శ్రమ, నిజాయితీ కలిసిన చోటే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 26
పనిలో నిబద్ధతతో ముందుకు సాగినవాడు
పరిశ్రమతో ప్రగతిని సాధించగలడు
మార్కెటింగ్ రంగమున రాణించగలడు
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
పనిని బాధ్యతగా స్వీకరించి, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగిన వ్యక్తి పరిశ్రమ ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించగలడు. మార్కెటింగ్ రంగంలో రాణించాలంటే మాటలకన్నా పని, అవకాశాలకన్నా నిబద్ధత ముఖ్యమని ఈ బండ్ల శతకం పద్య భావం



పద్యము 27
కుటుంబ కలయికతో సంస్కారం పెరుగును
స్నేహితుల సాన్నిధ్యంతో ఆనందం కలుగును
కళ్యాణ వేడుకలో సంతోషం వెల్లివిరియును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
కుటుంబ సభ్యుల కలయికతో సంస్కారం పెరుగుతుంది, స్నేహితుల సాన్నిధ్యం ఆనందాన్ని పంచుతుంది. ఈ రెండూ కలిసినప్పుడు కళ్యాణ వేడుక సంతోషంతో వెల్లివిరుస్తుంది. వ్యక్తుల మధ్య ప్రేమ, అనుబంధం, పరస్పర గౌరవం వేడుకకు నిజమైన వైభవాన్ని ఇస్తాయి. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 28
సరస్వతీ నదులవలె జ్ఞానం ప్రవహించును
సజ్జనులను విద్యతో జలపాతమై స్నానించును
వాగ్దేవిని వేడినపుడే వాక్కులవేగమవును
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
సరస్వతి కృపతో జ్ఞానం నదులవలె ప్రవహిస్తుంది. సజ్జనులు విద్య అనే జలపాతంలో స్నానించినట్లై పవిత్రతను పొందుతారు. వాగ్దేవిని భక్తితో వేడినప్పుడు మాటలకు వేగం, స్పష్టత, మాధుర్యం వస్తాయి. విద్య, వాక్కుల సమ్మేళనం వ్యక్తిని ఉన్నత స్థితికి నడిపిస్తుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 29
ఆరాధనలోన చిత్తము నిలిచినపుడే
ఆత్మ అనుభూతి అమృతమై తాకును
అనురాగ భావనగా మారే ప్రార్థనయే శ్రేష్ఠము
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
ఆరాధనలో మనసు ఏకాగ్రతతో నిలిచినపుడే ఆత్మానుభూతి అమృతంలా తాకుతుంది. ప్రేమతో, వినయంతో చేసే ప్రార్థనే శ్రేష్ఠమైనది. ఆరాధనలో అనురాగ భావం కలిసినప్పుడు, అది మాటలకన్నా మౌనంలోనే లోతైన అనుభవాన్ని ఇస్తుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



పద్యము 30
గుడికి వెళ్ళకపోయినా గర్భగుడి మనసే
మార్గదీపమై దివ్యమవును నమస్కారమే
దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి ఉన్నచోటే
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!


భావము
గుడికి వెళ్లకపోయినా మనసే గర్భగుడిగా మారితే అదే నిజమైన ఆరాధన. నమస్కారం కేవలం చేతుల జోడింపు కాదు, అంతరంగ వినయం. దేవుడు ఎక్కడో ఉన్నాడని కాక, మనలోనే ఉన్నాడని తెలుసుకున్నప్పుడే దైవదర్శనం సార్థకమవుతుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .



"బండ్ల శతకం" పద్యాలు ఒక్కో పేజీలో పది పద్యాలు ప్రచురించబడు తున్నాయి. క్రింద వరుస క్రమంలో ఇతర పద్యాల థంబ్‌నైల్స్‌తో 4 బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ పద్యాలు వరుసగా రికార్డ్ చేసి  Bandla Satakam " బండ్ల శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించ బడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK