మిత్రుల బయోగ్రఫీలు




           



వరాలను మించిన ఆనందాలు

ఎన్ని వరాలడిగినా ఇచ్చేస్తుంటాడు బోళాశంకరుడు శివుడు అయితే మనముందే వున్న శివుడు మన ఈ బాల్యమిత్రుడు శ్రీ వేంపరాల పెద్ద లింగారావు మాత్రం వరాలనయితే ఇవ్వడు గానీ వరాలను మించిన ఆనందాలను పంచుతారు - అందరినీ ఏకంచేసి, ఎక్కడున్నా ఒక చోటుకి చేర్చి - కాలేజీలో చదివిన మిత్రులను సమావేశ పరచడంలోనూ అట్లానే ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలుగా వున్న వారి గ్రామ ప్రజలను ప్రతి సంవత్సరం ఒక్క చోటికి చేర్చటం అది ఒక్క మన శ్రీ లింగారావుకే సాధ్యం. తద్వారా అంబరాలంటే సంబరాలుగా ప్రతి ఏటా గ్రామ ప్రజలు పండుగ వాతావరణంగా ఆనందాలు పొందుతుంటే వారిని ఏకం చేసిన శ్రీ లింగారావుకు మాత్రం ఆనందం తొణికిసలాడదు. ఎందుకూ అంటే నేను అనుకున్నది సాధించలేకపోయాను అని అంటుంటారు. ఏమీటా కారణం? అని ఒక్కసారి శ్రీ లింగారావు జీవితాన్ని చూస్తే......


పుట్టుక

పుట్టుక 15-10-1954 లో కనపర్రు గ్రామం, నాదెండ్ల మండలం.


తల్లి దండ్రులు

తల్లి దండ్రులు తల్లి స్వర్గీయ శ్రీమతి సీతా రావమ్మ గారు మరియు తండ్రి స్వర్గీయ శ్రీ కృష్ణమూర్తి గారు


కుటుంబం

భార్య శ్రిమతి అనంతలక్ష్మి గారు, 1981 జూన్ 17 న వివాహం జరిగింది. సంతానం ఒక కుమారుడు క్రాంతి కుమార్, ఒక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని.


విద్యాభ్యాసం

ప్రాధమిక విద్య కనుపర్రు లో, 6 వ తరగతి పొనుగుపాడు Z.P.H. School లో, 7వ తరగతి కనుపర్రు యు.పి.స్కూల్. 8, 9, 10, తరగతులు M. H. School Narasaraopet . ఇంటర్, & డిగ్రీ బి.కాం. యస్.యస్.యన్. కాలేజీ. నరసరావుపేట, పిజీ యం.కాం. డిస్కంటిన్యూ, ఉస్మానియా హైదరాబాద్ . సాధించాలనకున్నది , లెక్చరర్ కావాలనుకోవటం . కాని సాధించలేకపోయానంటూ ఈ విషయాన్ని బూతద్దంతో చూపుతున్నాడు తప్పితే కానీ తాను సాధించుకున్నవి చెప్పక పోవడం ఇక్కడ మన శ్రీ లింగారావు పెద్ద మనసుకు ఒక ఉదార స్వభావంగా వున్నదని ఇది చదివినవారు లేదా విన్న వారు వెంటనే గ్రహిస్తారు.


ప్రయివేటు ఉద్యోగాలు

మొదటి నుండి శ్రీ వేంపరాల పెద్ద లింగారావు ప్రయివేటు ఉద్యోగాలతో నెట్టుకొస్తూ, పిల్లల్ని పిజీ (M.Sc chemistry) వరకు చదివించారు, అబ్బాయి పి.హెచ్.డి. ఎయిమ్స్ న్యూడిల్లీ నందు చేసి అహ్మదాబాద్ లో ఇంటాస్ లాబ్ లో పనిచేస్తున్నారు. అమ్మాయి, అల్లుడు ఇద్దరూ M. S. N. Labs షాద్ నగర్ లో పనిచేస్తున్నారు .






గ్రామాభివృద్ధి కమిటీ

శ్రీ లింగారావు సహకారం తో వారి ఊరు కనుపర్రు హై స్కూల్ ఆప్ గ్రేడ్ అయింది , ప్లే గ్రౌండ్ కొరకు గ్రామస్తులందరిని కూడ్చి, గ్రామాభివృద్ధి కమిటీ గా ఏర్ప‌రిచి అందులో శ్రీ లింగారావు ఒక సభ్యుడు గా ఉన్నారు. తరువాత ఆ కమిటీ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. దానిలో శ్రీ లింగారావు ప్రవాస భారతీయులకు, ప్రవాసాంధ్రులకు, ఇతర గ్రామాలలో నివశిస్తున్న కనుపర్రు ఊరి ఆడపడుచులకు ఆహ్వనం పలకటం ( వారందరికీ) ఫోన్ చేయటం, ఈ అనుభవం శ్రీ లింగారావుకు తన చిన్న నాటి క్లాసు మేట్సు బాల్య మిత్రులందరినీ సమావేశ పరచడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత రామాలయం, శివాలయం గుళ్ళ నిర్మాణం లో శ్రీ లింగారావు గవర్నమెంట్ నుండి పర్మిషన్ కొరకు హైదరాబాద్ లోని దేవదాయ ధర్మదాయ శాఖ ఆఫీస్ చుట్టూ తిరిగి పర్మిషన్ (అప్పటి జిల్లా మంత్రి గారి , సహాయం తో ) తెచ్చారు. గ్రామస్తులతో కలసి , గ్రామంలోను, అవిశాయపాలెం, ఎండుగుంపాలెం, సాతులూరు, జోన్నలగడ్డ, తదితర గ్రామాల్లో విరాళాలు వసూలు చేసారు. మొత్తం 1,00,00,000- (కోటి) గవర్నమెంట్ గ్రాంటు 60,000 మొత్తం కోటి అరవై లక్షలు. ఇది శ్రీ లింగారావు నెరవేర్చినది ,


సమావేశాలు

కనుపర్రు గ్రామానికి అనేక అభివృద్ది పనులలో సేవలంధించడం అటు వారి ఊరు గ్రామ ప్రజలను ప్రతి సంవత్సరం సమావేశపరచడం ఇటు చిన్న నాటి బాల్య మిత్రులను సమావేశపరచడం వంటి విషయాలలో వరాలను మించిన ఆనందాలను పంచిన శ్రీ లింగారావు అకాలంగా కన్ను మూసి చివరిగా అందరినీ శోకసముద్రం లోకి నెట్టడం కించిత్ బాధాకరమైన విషయం


ఆత్మకు సద్గతి కలగాలి

శ్రీ వేంపరాల పెద్ద లింగారావు ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటున్నాను.



బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Bandla App image CLICK HERE
Mr VSR Avadhani CLICK HERE
Mr Syed Naseer Ahamed CLICK HERE
Dr Tata Seva Kumar CLICK HERE
Dr Banda Jawahar CLICK HERE
Dr K Naga Malleswara Rao CLICK HERE
Mr Dasari Rama Muthy CLICK HERE
Mr Gaddapati Srinivasu CLICK HERE
Mr Kanuparti Surendranath CLICK HERE
Mr Kareti Sai Krishna CLICK HERE
Mr Linga Rao CLICK HERE
Mr Nallapati Satyanarayana CLICK HERE
Mr Prasad Sarma CLICK HERE
Mr PV Uma Maheswara Rao CLICK HERE
www.bandla.app Image
www.bandla.app Image