మిత్రుల బయోగ్రఫీలు




           



డాక్టర్ బందా జవహర్ కన్నీళ్ల నుంచి కరుణ వరకు

ఏడుస్తూ పుడతాం, పోతూ ఏడిపిస్తాం జీవిత సత్యాన్ని నిజం చేసినవారిలో బందా జవహర్ ఒకరు. పుట్టుకతోనే శిశువు ఏడవకపోవడం, ఆపై అమాయక చికిత్సల భయంకర అనుభవాలు అన్నీ ఆయన బాల్యాన్ని శోకసముద్రంగా మార్చాయి. అయినా ఆ బాధలు ఆయనను కుంగదీయలేదు, కరుణగా మలిచాయి.



బీదరికంలో బలంగా నిలిచిన చదువు

మాథ్స్‌లో నూటికి నూరు మార్కులు ఇంజినీరింగ్ కలలున్న వేళ, తల్లి కాన్సర్ వ్యాధితో పోరాటం ఆయన దారిని మెడిసిన్ వైపు మళ్లించింది. గర్భసంచి కాన్సర్‌తో పదిహేనేళ్ల పోరాటం అనంతరం, తల్లి మెడికల్ ఫైనల్ పరీక్షల చివరి రోజునే పరమపదించటం ఆ దుఃఖం ఆయన సంకల్పాన్ని మరింత గట్టిచేసింది. ఒకే ఏప్రాన్, ఒకే పుస్తకం, మార్పిడిగా వేసుకున్న బట్టలు లైబ్రరీ పుస్తకాలు, రూమ్‌మేట్ నిద్రపోతే చదువు బీదరికాన్ని ఓడించిన అష్టావధానమే ఆయన విద్యా ప్రయాణం.



వైద్యుడిగా తొలి అడుగులు

1980లో నరసరావుపేటలో డా. కోడెల శివప్రసాదరావు గారి వద్ద అసిస్టెంట్‌గా శస్త్రచికిత్స విద్య నేర్చుకున్నారు. 1982లో వినుకొండలో రవీంద్ర హాస్పిటల్ ప్రారంభించి, నాణ్యతతో కూడిన సేవలతో ప్రజల నమ్మకాన్ని సంపాదించారు. “స్థానికుడనని కాదు నిజాయితీ సేవల వల్లే ప్రాక్టీస్ పెరిగింది” అనేది ఆయన మాట.



కుటుంబం బలం, బాధ్యత

25-07-1955, అగ్నిగుండాల గ్రామంలో జననం. తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి సీతమ్మ, శ్రీ సుబ్బారావు (స్వాతంత్ర్య సమరయోధుడు, భూములు అమ్మి దేశసేవ చేసిన మహనీయుడు). 1982లో మాధవి గారితో వివాహం. సంతానం ఇందిరాప్రియదర్శిని (B.Tech), డా. రాకేష్ (MS General), డా. రాహుల్ (MS Ortho). అల్లుడు కిరణ్ (M.Tech), కోడళ్లు డా. శారద (MBBS, DGO), డా. రమాలక్ష్మి (MS General). కుటుంబమంతా సేవలోనే నిలిచింది.







చీమకుర్తి మలుపు

మామగారు, నేత్రవైద్యులు డా. ముక్కామల నరసింహారావు గారి అభ్యర్థనపై చీమకుర్తి హాస్పిటల్ బాధ్యతలు స్వీకరించారు. మొదట రోగుల కరువు, అయినా ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు హాస్పిటల్‌లోనే పేదలకు ఉచిత సేవ, పుస్తకాల అధ్యయనం. క్రమంగా పేరు పెరిగి, చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు రావడం మొదలైంది.



సేవలకు జాతీయ గుర్తింపు

పేదలకు ఉచిత వైద్యం, సమాజసేవ ఇవే కాదు, ప్రకాశం జిల్లా జైలులో ఖైదీల పునరావాసానికి సోలార్ బ్రెడ్ మేకింగ్, బుక్ ప్రింటింగ్ వంటి శిక్షణ యూనిట్లు. తన హాస్పిటల్ ప్రాంగణంలో అంధ గురుకుల పాఠశాల 30 మంది అంధ విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, దుస్తులు, ప్రాథమికం నుంచి పీజీ వరకు విద్య. ఈ సేవలకు కేంద్ర ప్రభుత్వ “విజయశ్రీ అవార్డు”. “పేదల డాక్టర్” గా జెమినీ టీవీ డాక్యుమెంటరీ. గురుకుల విద్యార్థుల్లో పలువురు గ్రూప్ 1 లో ఎంపిక నాణ్యతకు సాక్ష్యం. ఇందులో సతీమణి మాధవి గారి రోజువారీ శ్రద్ధ కీలకం.



ప్రజా జీవితంలో ముందువరుస

ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆలోచనధార/జన విజ్ఞాన వేదికల్లో బాధ్యతలు, ప్రస్తుతం ప్రకాశం జిల్లా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు.



డాక్టర్ జవహర్ హాస్పిటల్

కుగ్రామంలో పుట్టి, మొరటు వైద్యాల మధ్య పెరిగి, “నేను అనుభవించిన కష్టాలు ఎవరికీ రాకూడదు” అన్న తపనతో నేడు డాక్టర్ జవహర్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ రూపుదిద్దుకొని ప్రారంభించబడింది . వైద్యం, విద్య, పునరావాసం మూడు మార్గాల్లో సేవే ఆయన జీవితం.
బీదరికాన్ని ఓడించి, కరుణను కట్టుబెట్టిన ఈ ప్రయాణం నిజంగా అభినందనీయం.



బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Bandla App image CLICK HERE
Mr VSR Avadhani CLICK HERE
Mr Syed Naseer Ahamed CLICK HERE
Dr Tata Seva Kumar CLICK HERE
Dr Banda Jawahar CLICK HERE
Dr K Naga Malleswara Rao CLICK HERE
Mr Dasari Rama Muthy CLICK HERE
Mr Gaddapati Srinivasu CLICK HERE
Mr Kanuparti Surendranath CLICK HERE
Mr Kareti Sai Krishna CLICK HERE
Mr Linga Rao CLICK HERE
Mr Nallapati Satyanarayana CLICK HERE
Mr Prasad Sarma CLICK HERE
Mr PV Uma Maheswara Rao CLICK HERE
www.bandla.app Image
www.bandla.app Image