విద్యాభ్యాసం
శ్రీ సాయి కృష్ణ నాన్న శ్రీ అంజయ్య గారు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వారి బదిలీల ననుసరించి, శ్రీ సాయి కృష్ణ చదువులు వివిధ ఊళ్ళలో సాగినవి. ప్రాధమిక విద్య రేపల్లె లోనూ, నాల్గవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు సత్తెనపల్లి లోనూ, తొమ్మిది, పది తరగతులు నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులు నరసరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజ్ లలో సాగినవి.