అక్షతలను వేసి ఆశీర్వదించే వారు
నాడు పుట్టిన రోజు అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ.... ఇంకా పెద్దవారు ఎవరయినా కానీ పిల్లలకు నువ్వుల నూనె తలకు అద్ది వంటికి రాసి అభ్యంగన స్నానం చేయించి, కొత్త బట్టలు ధరించి ఇంట్లో దేవుడికి ప్రార్ధన చేయించి, పెద్దలందరికీ నమస్కారం చేయించి వారి ఆశిర్వాదాలు తీసుకొని, దగ్గర్లో గుడికి తీసుకెళ్ళి దైవ దర్శనం చేయించేవారు, అక్కడి పూజారుల ఆశిర్వాదం కూడా తీసుకునేవారు. ఇంటివద్ద పేరంటం కు వచ్చిన పెద్దలు మంగళ హారతుల నిచ్చి అక్షతలను వేసి ఆశీర్వదించే వారు. పేరంటం కు వచ్చిన వారందరికీ పసుపు కుంకుమలు, తాంబూలాలతో పాటు తమ శక్తి కొద్ది కానుకలు కూడా ఇచ్చే వారు అప్పటి పిల్లల తల్లిదండ్రులు.