శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్



Mr Syed Naseer Ahamed

సద్భావన, స్నేహం, సామరస్యం, సదవగాహన, సహిష్ణుతల పటిష్టత లక్ష్యంగా ఎటువంటి స్వప్రయోజనాలను ఆశించకుండా చరిత్ర రచన ప్రయాణం సాగిస్తున్న శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్.


ఉద్యోగానికి సయితం రాజీనామా చేసి

ఈనాడు సంపాదనే ప్రధాన ధ్యేయంగా, ప్రతి విషయం కూడా మానవ సంబంధాలతో సంబంధం లేకుండా వ్యాపార ధోరణులతో ప్రతి ఒక్కరి సామాజిక జీవనం సాగిపోతున్న సంక్లిష్ట సాంఘిక వాతావరణ పరిస్థితులు మన చుట్టూ తాండవిస్తున్నాయి. ఈ అవాంఛనీయ పరిస్థితులలో తాను చేస్తున్న ఉద్యోగానికి సయితం రాజీనామా చేసి 1999 నుండి తాను నిర్దేశించుకున్న పంధాలో ముందుకు సాగుతూ వెనుదిరగకుండా తన జీవిత చక్రాన్ని పరుగులెట్టిస్తున్నారు చరిత్రకారుడు శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్. సద్భావన, స్నేహం, సామరస్యం, సదవగాహన, సహిష్ణుతల పటిష్టత లక్ష్యంగా చరిత్ర రచనా దిశగా అవిశ్రాంత ప్రయాణం సాగిస్తున్నారు నశీర్ అహమ్మద్.


ముస్లిం యోధుల జాడలు

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ముస్లిం యోధుల జాడలు చరిత్ర పుటలకు సక్రమంగా ఎక్కలేదన్న విషయాన్ని గమనించిన శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ఆ లోటు తీర్చడానికి పూనుకున్నారు. అవిశ్రాంత అన్వేషణ, నిరంతర పరిశోధనలతో, అహర్నిశలు అలుపు లేకుండా శ్రమిస్తూ చారిత్రక సమాచార సేకరణకు పూనుకున్నారు. ఆ అన్వేషణలో తాను సమకూర్చుకున్న సమాచారంతో భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ముస్లిం జనసముదాయాల పాత్రను వివరిస్తూ పరిశోధనాత్మక చరిత్ర గ్రంధాల రచన - ప్రచురణ - పంపిణీ - ప్రచార కార్యక్రమాలకు తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకున్నారు. ఆ మహత్తర కార్యక్రమానికి ఆయన కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు, వదాన్యులు ఆలంబనగా నిలవడంతో ఆయన విరామం ఎరుగని చరిత్రకారునిగా ముందుకు ఉపక్రమించారు.


వ్యవస్థలు సమిష్టిగా చేయవలసిన పనిని అన్నీ తానై

శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించి, వెలువరించిన చరిత్ర గ్రంథాలను చదువుతుంటే, అంగబలం అర్థబలం పుష్కలంగా గల సంస్థలు, వ్యవస్థలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే చేయగలిగిన బృహత్తర కార్యక్రమంగా మనకు అర్థం అవుతుంది. అంతటి కార్యభారాన్ని గత రెండున్నర దశాబ్దాల నుండి అన్నీ తానై మోస్తున్నారు, ఒంటి చేత్తో నశీర్ అహమ్మద్ నిర్వహిస్తున్నారు.


శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ కు డాక్టరేట్, పద్మశ్రీ వరించలేదేమిటా?

ఒక్కనిగా ఒకే చారిత్రక విషయాన్ని పలు కోణాల నుండి విశ్లేషిస్తూ, వివరిస్తూ, సరికొత్త సమాచాచారాన్ని నిరంతర అన్వేషణ, పరిశోధనలతో శోధించి సాధించి పాఠకుల ముందుంచిన విధానాలకు ఏ విశ్వవిధ్యాలయం నుండి కూడా శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ కు డాక్టరేట్ ఇంకా వరించలేదేమిటా? అన్పిస్తుంది. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్ కూడా ఇంతవరకు వరించలేదేమిటా? అనిపించక మానదు ఎవరికైనా.


అశేష ప్రజావాహిని మూకుమ్మడిగా

భారత స్వాతంత్ర్య సమరం సాధించిన ఫలాల ఫలితం విభిన్న మతాల, విభిన్న ప్రాంతాల అశేష ప్రజావాహిని మూకుమ్మడిగా ఐక్యంగా పోరాడి ప్రాణాలొడ్డి సాధించుకుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో అనేక ముస్లిం స్వాతంత్ర్య సమర యోధుల సాహసోపేత, త్యగమయ అపూర్వ పాత్ర ఉన్నప్పటికీ, చరిత్ర గ్రంథాలలో ఒకరిద్దరు తప్ప అసంఖ్యాక ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రస్తావనలు అక్కడక్కడ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ దుస్థితిని గమనించిన శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ కృషి, పరిశోధనల ఫలితాలే 1999 నుండి ఇప్పటి వరకు వెలువడుతున్న పరిశోధనాత్మక చరిత్ర గ్రంధాలు.


వివిధ కళా రంగాలకు

సయ్యద్ నశీర్ అహమ్మద్ చరిత్రకారుడు మాత్రమే కాదు ఆయన రచయిత, నటుడు, చిత్రకారుడు, వ్యంగ చిత్రకారుడు, వక్త, సంపాదకుడు, పాత్రికేయుడు, న్యాయవాది, చరిత్రకారుడు, సామాజిక సేవాకార్యకర్త గా వివిధ కళా రంగాలకు సేవలందిస్తున్నారు.


21 పరిశోధనాత్మక చరిత్ర పుస్తకాలు

శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ఇప్పటి వరకూ 21 పరిశోధనాత్మక చరిత్ర పుస్తకాలు రాసి ప్రజలపరం చేశారు. ఆయన గ్రంథాలలో అత్యధికం ఎంపిక చేసిన గ్రంధాలయాలకు, ప్రింట్ - ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల గ్రంథాలయాలకు, ప్రముఖులకు తన వదాన్యుల బహుమతి గా అందించటం విశేషం.


పుట్టుక :

శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ నెల్లూరు జిల్లా అల్లూరు తాలుకా పురిణి గ్రామంలో 1955 వ సంవత్సరం డిసెంబర్ నెల 22 న జన్మించారు.






తల్లిదండ్రులు

స్వర్గీయ శ్రీమతి బీబిజాన్ (1936-2008), స్వర్గీయ శ్రీ సయ్యద్ మీరా మొహిద్దీన్ (1933-1965).


చదువు :

ఎం.కామ్., ఎల్‍ఎల్.బి., సాహిత్యరత్న (హింది), డి.జె.


కుటుంబం

వివాహితులు. సహధర్మచారిని శ్రీమతి షేక్ రమీజా బాను M.A., B.Ed., 1979 సంవత్సరం ఏప్రిల్ 15 తేదీన వీరి వివాహం జరిగింది. ఒక కుమార్తె శ్రీమతి సయ్యద్ జాస్మిన్ అహమ్మద్ M.A.,(English). అల్లుడు డాక్టర్ యస్. యం. తల్మీజుద్దిన్ B.D.S., ప్రకాశం జిల్లా కందుకూరు లో స్వంత ఆసుపత్రి Care Dental Hospital నిర్మించుకుని వైద్యరంగాన రాణిస్తున్నారు. మనవళ్ళు ఇద్దరు.


Mr Syed Naseer Ahammed

సయ్యద్ నశీర్ అహమ్మద్ కు డాక్టరేట్ లేకున్నా

విశ్వవిధ్యాలయాలలో పిహెచ్.డి చేసేవారు ఎవరైనను ఆయన విరచిత చరిత్ర గ్రంథాలను ఎంచుకొని విజయం వైపు అడుగు వేయటానికి మంచి అవకాశం గా ఉన్న గ్రంథాలు నశీర్ చరిత్ర గ్రంథాలు.


శాశ్వత నివాసం :

శ్రీరామ్ ఆర్కేడ్,
ఫ్లాట్ నం : సి 2,
అమరావతి రోడ్,
ఉండవల్లి - 522501,
తాడేపల్లి మండలం,
గుంటూరు జిల్లా ,
ఆంధ్ర ప్రదేశ్.


ప్రస్తుత నివాసం :

పిడుగురాళ్ల, పల్నాడు జిల్లా.


పురస్కారాలు, అవార్డులు, రివార్డులు :

శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ గత రెండు దశాబ్దాలుగా సాగిస్తున్న కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు అవార్డులు రివార్డులు ఆయనకు లభించాయి. రాష్ట్ర - జాతీయ స్థాయిలో పలు జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి, వివిధ సాహిత్య - సంస్థల నుండి పలు సన్మానాలు, సత్కారాలను ఆయన అందుకున్నారు.


నూతన రికార్డులు

"పండిత రాంప్రసాద్ బిస్మిల్-అశఫాక్కుల్లాహ్ ఖాన్ " గ్రంధం తెలుగు, ఆంగ్లం, ఉర్ధూ మూడు భాషల్లో 20,000 పైగా ప్రతులు ప్రచురించి ఆసక్తిగల పాఠకులకు బహుమతిగా ఉచితంగా పంపిణీ చేయబడ్డాయి. గాంధీజీ ప్రాణ రక్షకుడు : బతఖ్ మియా అన్సారి పుస్తకాన్ని తెలుగు, ఉర్ధూ, హిందీ, ఆంగ్ల నాలుగు భాష లలో 21000 పైగా కాపీలు ప్రచురించి దేశమంతటా ఉచితంగా పంపిణీ చేశారు. ఈవిధంగా ఈ రెండు గ్రంధాలు ప్రపంచ సాహిత్య చరిత్రలో నూతన రికార్డును నమోదుచేశాయి. ఈ విధంగా శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ విరచిత పలు ఇతర గ్రంధాలు దేశం అంతటా ఉచితంగా పంపిణీ అయ్యాయి.


యువత, విధ్యార్ధుల ఎరుకలోకి

మన పూర్వీకుల త్యాగమయ - సాహసోపేత చరిత్రలను ప్రధానంగా యువత, విధ్యార్ధుల ఎరుకలోకి తెచ్చేందుకు, భారత ముస్లిం సమరయోధుల వివరాలతో చిరుపొత్తాలను ప్రచురించి పంపిణీ చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి కరపత్రాలను ప్రచురించి ప్రజలకు అందిస్తున్నారు. విధ్యార్ధులు తమ పుస్తకాలకు అంటించుకునే "నేమ్ స్టిక్కర్లు" వివిధ సంస్థల సహాయ సహకారంతో లక్షల్లో ప్రచురించి ఉచితంగా పంపిణీ గావించారు. ఇంకా విద్యార్థులకు అందజేస్తున్నారు.


ఆసక్తిగల పాఠకులకు ఉచితంగా

శ్రీ నశీర్ రాసిన చరిత్ర గ్రంధాలన్నిటి PDF FILES రూపంలో ఆసక్తిగల పాఠకులకు ఉచితంగా అందిస్తున్నారు. ఆంగ్లం, తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోని ఈ గ్రంధాలు కావలసిన వారు శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ఫోన్ నంబర్‍కు WhatsApp ద్వారా కాంటాక్ట్ ఐయ్యి WhatsApp ద్వారా PDF FILES ను ఉచితంగా పొందవచ్చు.


చిత్ర పటాల ప్రదర్శనలు

భారత దేశంలోని వివిధ సంస్థల, వ్యక్తుల ఆహ్వానం మేరకు భారత ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల సమాచారాన్ని భారత దేశ మంతటా తిరిగి చిత్ర పటాల ప్రదర్శనలతో ప్రజలందరికీ తెలియ జేస్తున్నారు.


ఎవరైనను ఆహ్వానించవచ్చు

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిం యోధుల పాత్రను వివరిస్తూ ఆయన చేస్తున్న ప్రసంగాల కొరకు గానీ, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాల ప్రదర్శనల కొరకు గానీ ఎవరైనను ఆయనను ఆహ్వానించవచ్చు.


సంప్రదించాల్సిన మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్

శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ నుండి మనకు లభిస్తున్న ఉచిత పుస్తకాల సేవలు మరియు ప్రసంగాలు, ప్రదర్శనల కొరకు ఆహ్వానించాలను కొనువారు సంప్రదించాల్సిన మొబైల్ ఫోన్ నంబర్ + 91 9440241727 మరియు ఈమెయిల్ అడ్రస్ Naseerwriter2020@gmail.com


అభినందనీయులు

ఆర్ధిక - సామాజిక అసమానతలు లేని లౌకిక, ప్రజా స్వామ్య వ్యవస్థ నిర్మాణంలో రచయితగా, చరిత్రకారునిగా భాగస్వామ్యం అందించడం, జ్ఞానం ప్రజాస్వామీకరించ బడాలన్న ఆకాంక్షతో అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం సాగిస్తున్న శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు.


శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ విరచిత పరిశోధనాత్మక చరిత్ర ముద్రిత గ్రంధాలు :


1. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం మహిళలు

ఈ గ్రంధం తొలిసారిగా 1999లో ముద్రితమయ్యింది, ఆ తరువాత 2003 ఒకసారి, పూర్తిగా తిరగరాయబడి 296 పుటలతో 2006లో ప్రచురణ. ఈ గ్రంధంలో 1857 నాటి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం నుండి 1947లో మాతృభూమికి స్వాతంత్య్రం సిద్దించేంత వరకు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో, ఉద్యమాలలో పాల్గొన్న పలువురు మహిళల సాహసోపేత పోరాటాలను, ఆయా యోధుల జీవిత విశేషాలనుప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఈ పుస్తకం లోని సమాచారాన్ని పలు వార, దినపత్రికలు ధారావాహికంగా ప్రచురించడం మాత్రమే కాకుండా సందర్భాన్ని బట్టి వ్యాసాలను కూడా ప్రచురించాయి, ప్రచురిస్తున్నాయి.


2. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లింలు

ఈ గ్రంధం తొలిసారిగా 1999లో ముద్రితమయ్యింది, ఆ తరువాత వివిధ ప్రచురణ సంస్థలు, వ్యక్తులు ప్రచురణకు సంసిద్దత తెలుపగా ఎటువంటి పారితోషికం ఆశించకుండా పుస్తక ప్రచురణకు అనుమతించగా 2003, 2006, 2011, 2012 లో పలు సంస్థలు, వ్యక్తుల ద్వారా పునర్ముద్రితం అయ్యాయి. ఇప్పటికి కూడా పలు సంస్థలు ఈ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ పునర్ముద్రితం కావిస్తున్నాయి. ఈ పుస్తకంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆరంభమయిన ఫకీర్లు - స్న్యాసుల తిరుగుబాటు నుండి 1947 న మాతృభూమికి స్వాతంత్య్రం సిద్దించేంత వరకు ఇంటా - బయట సాగిన అహింసోద్యమాలు, సాయుధ పోరాటాలు సాగిన తీరుతెన్నులు, ఆయా ఉద్యమాలలో, పోరాటాలలో పాల్గొన్న యోధుల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.


3. భారత స్వాతంత్య్రోద్యమం : ఆంధ్ర ప్రదేశ్ ముస్లింలు

ఈ గ్రంధం ఆగస్టు 2001 లో తొలిసారిగా 80 పుటలతో ముద్రితమయ్యింది. ప్రచురితమయిన నాలుగు మాసాల్లో పునర్ముద్రితం అయ్యింది. ఆ నాడు 80 పుటలకు పరిమితమయిన ఈ గ్రంధం ఆ తరువాత ఏడు సంవత్సరాలుగా సాగిన అన్వేషణలో లభించిన అదనపు సమాచారంతో పూర్తిగా తిరగరాయబడి 394 పేజీలకు విస్తరింపబడి 2010 లో పునర్ముద్రితం అయ్యింది. 1780 లో విశాఖపట్నంలోని ఆంగ్లేయుల సైనిక స్థావరం మీద సుబేదా అహమ్మద్ సాగించిన తిరుగుబాటు నుండి 1857 నాటి ప్రధమ భారత సంగ్రామం విషేషాలను పొందుపర్చుతూ 1947లో మనకు ఆంగ్లేయులనుండి పూర్తిగా స్వేచ్చా - స్వాతంత్య్రాలు లభ్యం అయినంతవరకు సాగిన పోరాటాలు, ఉధ్యమాలు, ఆయా పోరాటాలతో ఉద్యమాలలో ప్రముఖ పాత్ర నిర్వహించిన స్వాతంత్య్ర సమర యోధుల జీవిత విశేషాలను వివరిస్తూ ఆయా యోధుల చిత్రాలతో సహా ఈ బృహత్తర గ్రంధం ప్రచురిత మయ్యింది.


4. మైసూరు పులి : టిపూ సుల్తాన్

ఈ గ్రంధం 2002 లో ముద్రితమయ్యింది. , ఆ తరువాత పలు సంస్థలు, వ్యక్తులు ఈ గ్రంధాన్ని పునర్ముద్రణకు సిద్దం కాగా ఎటువంటి పరిహారం కోరకుండా పునర్ముద్రణకు అనుమతించడం జరిగింది. ఆ కారణంగా తిరగ రాయబడిన ఆ గ్రంధం 2004, 2006, 2011 లో ఆ తరువాత కూడా పలువురిచేత పునర్ముద్రితమయ్యింది. ఈ గ్రంధంలో మైసూరు పులిగా విఖ్యాతుడయిన టిపూ సుల్తాన్ జీవిత చరిత్రను, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాలను, ఆయన పరిపాలనా పద్దతులను వివరిస్తూ ఆయనమీద వచ్చిన ఆరోపణల వాస్తవికతను పలు ఆధారాల సయితంగా పేర్కొనడం జరిగింది.


5. షహీద్ - యే - అజం అష్ఫాఖుల్లా ఖాన్

ఈ పుస్తకం 2002 ఆగస్టులో ముద్రితమయ్యింది. ఆ తరువాత తిరగరాయబడి మరింత సమాచారంతో 2006 లో పునర్ముద్రితమయ్యింది. అప్పటినుండి పలు సంస్థలు, వ్యక్తులు ఈ గ్రంధాన్ని పలుమార్లు పునర్ముద్రించుకున్నారు. ఆ తరువాత ఈ గ్రంధం 2010 లో ’ఉర్దూ’ భాషలోకి అనువదించి”షహీద్ - యే - వతన్ అష్ఫాఖుల్లా ఖాన్’ పేరుతో ప్రచురితమైంది. ఈ గ్రంధాన్ని తెలుగు - ఉర్దూ భాషలలో దఫాలుగా వేల ప్రతులను ముద్రించి దేశం అంతటా ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధానంగా ఎంపిక చేసిన గ్రంధాలయాలకు, సాహిత్య సంస్థలకు మా వదాన్యుల కానుకగా అంధించారు. ఈ గ్రంధంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగుతున్న సాయుధ పోరాటంలో భాగస్వామిగా 27 ఏండ్ల వయస్సులోనే ఉరికి గురయిన అష్ఫాఖుల్లా ఖాన్ పోరాట చరిత్రను అరుదయిన చిత్రాలతో అందించడం జరిగింది.


6. భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజా పోరాటాలు

ప్రధమంగా ఈ గ్రంధం 2003 డిసెంబర్ లో ముద్రితమయ్యింది. ఆ తరువాత వివిధ ప్రచురణ సంస్థలు 2007, ఆ తరువాత ఈ గ్రంధాన్ని పునర్ముద్రించాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం లో భాగంగా ప్రజలనుండి వచ్చిన ప్రజా నాయకుల నాయకత్వంలో వారి అనుమాయులు, ప్రజలతో కలసి ఆంగ్లేయులతో సాగించిన ప్రధాన పోరాటాల - ఉద్యమాల విశిష్టతలు, విశేషాలతో ఈ గ్రంధం రూపొందింది. ఈ గ్రంధంలో '1. బెంగాలు ఫకీర్లు పోరాటం, 2. వహాబీ వీరులు, 3. ఫరాజీ యోధులు, 4. మొప్లా మొనగాళ్ళు, 5. ఖుదా-ఏ-ఖిద్మత్‍గార్ వీరులు’ శీర్షికలతో మొత్తం ఐదు అధ్యాయాలలో ఆనాటి విశిష్ట పోరాటాలను వివరించడం జరిగింది.


7. భారత స్వాతంత్య్ర సంగ్రామం : ముస్లిం యోధులు (ప్రధమ భాగం)

ఈ గ్రంధం 2005 లో ముద్రితమయ్యింది. ఆ తరువాత ఒక ప్రచురణ సంస్థ ఈ గ్రంధాన్ని 2007 లో పునర్మ్రుద్రించింది. ఈ గ్రంధాన్ని పలు భాగాలుగా వెలువరించాలన్నది రచయిత సంకల్పం. ఈ గ్రంధంలో ఆంగ్లేయులతో పోరాటాలు సాగించిన ప్రతి ఒక్క సమరయోధుని విశేషాలను క్లుప్తంగా కాకుండా వివరంగా పాఠకుడి ఎరుకలోకి తీసుకురావాలన్నది ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా తొలి భాగం విడుదలయ్యింది. ఆ తరువాత వచ్చిన పలు సాంకేతిక సంకటాల కారణంగా ఆ ప్రయత్నం ప్రస్తుతానికి విరామం తీసుకుంటున్నది.


8. చిరస్మరణీయులు (బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న ముస్లిం యోధులు)

ఈ పుస్తకం 2008 లో ముద్రితమయ్యింది. ఆ తరువాత ఒక ప్రచురణ సంస్థ ముందుకు వచ్చి 2009 లో పునర్మ్రుద్రించింది. ఈ గ్రంధంలో వంద మంది స్వాతంత్య్ర సమర యొధుల వివరాలు, వారి చిత్రాలను పొందపర్చడం జరిగింది. ఒక్కొక్క యోధునికి రెండు పుటలు కేటాయింపుతో పుస్తకం రూపొందింది.


9. 1857 : ముస్లింలు

ఈ గ్రంధం తొలిసారిగా 2009 జనవరిలో ముద్రితమయ్యింది. ఆ తరువాత ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ ముందుకు వచ్చి ఈ గ్రంధాన్ని 2013లో పునర్ముద్రించింది. ఈ గ్రంధం 1857 నాటి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం లో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన పాత్రను వివిధ అధ్యాయాలుగా విభజించి వీలయినంత వివరంగా తగిన ఆధారాలతో, అపురూప చిత్రాలతో తయరయ్యింది.






10. చరితార్ధులు (ఆల్బం)

ఈ బృహత్తర గ్రంధం 2014లో ప్రచురితమయ్యింది. ఆ తరువాత 2019లో తమిళంలో పునర్ముద్రణ జరిగింది. ఈ గ్రంధం 1757 నుండి 1948 వరకు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని 155 మంది ముస్లిం యోధుల చిత్రాలతో కూడినది. ఈ ఆల్బం లో పొందుపర్చబడిన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలను క్లుప్తంగా తెలుగు, ఆంగ్ల భాషలలో ఇవ్వబడింది. ఈ గ్రంధాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన పలు ప్రభుత్వం - ప్రైవేట్ గ్రంధాలయాలకు, ప్రముఖ సాహిత్య సంస్థలకు, ప్రముఖులకు వదాన్యుల చిరుకానుకగా అందించారు. ఈ తరహా బృహత్తర గ్రంధం భారత ఉపఖండంలో ఇంతవరకు రాలేదని జాతీయంగా అంతర్జాతీయంగా ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం ఈ గ్రంధం పలు భాషల్లో తర్జుమా అవుతున్నది.


11. బిస్మిల్-అష్భాఖ్

ఈ గ్రంధం తొలిసారిగా 2015 లో ప్రచురితమయ్యింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవ వీరులు శ్రీ రాం ప్రసాద్ బిస్మిల్, శ్రీ అష్భాఖుల్లా ఖాన్ ల స్నేహ బంధాలు, త్యాగాలు, భారతీయుల ఐఖ్యతకు వారి కృషి వివరిస్తూ వెలువడిన గ్రంధమిది. ఈ గ్రంధాన్ని 2015 డిసెంబర్ లో మూడువేల కాపీలు ముద్రించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉచిత పంపిణి జరిగింది.


12. పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అష్భాఖుల్లా ఖాన్

మత సామరస్యానికి, హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీకలుగా నిలచిన స్వాతంత్య్ర సమర యోధులు శ్రీ రాం ప్రసాద్ బిస్మిల్, శ్రీ అష్భాఖుల్లా ఖాన్ ల స్నేహ బంధాలను, త్యాగనిరతిని, సాహోసపేత చర్యలను మరిన్ని విశేషాలతో తిరగరాసి 2017 లో ప్రచురించిన గ్రంధమిది.

ఈ గ్రంధాన్ని తెలుగు, ఉర్ధూ, ఆంగ్ల భాషల్లో 20,000 (ఇరవై వేలు) కాపీలు ముద్రించి 2017 డిసెంబర్ లో కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఇండియాలోని 252 పట్టణాలలో ఉచిత పంపిణి జరిగింది. ఈ యోధులిరువురిని ఆంగ్ల ప్రభుత్వం ఉరితీసిన డిసెంబర్ 19, 1927 ను స్మరించుకుంటూ డిసెంబర్ 19 న దేశంలోని 158 కేంద్రాలలో ఈ పుస్తకం ఆవిష్కరింపబడి ప్రపంచ సాహిత్య చరిత్రలో నూతన రికార్డును సృష్టించింది. ఆ తరువాత ఇప్పటి వరకు మొత్తం మీద 252 కేంద్రాలలో ఇది ఆవిష్కరణ జరుపుకుని వినూత్న చరిత్రకు కారణమయ్యింది.

ఈ గ్రంధాన్ని 2020లో మరో 3000 ప్రతులు తెలుగులో ప్రచురించి ఈ యోధులిరువురిని 3000 ప్రతులు తెలుగులో ప్రచురించి ఈ యోధులిరువురిని ఆంగ్ల ప్రభుత్వం ఉరితీసిన డిసెంబర్ 19, 1927 ను స్మరించుకుంటూ డిసెంబర్ 19 న రెండు తెలుగు రాష్ట్రాలలో రచయిత శ్రీ నశీర్ వదనాన్యుల చిరుకానుకగా పంపిణీ చేయడం జరిగింది. మరోమారు ఈ గ్రంధం రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల ఆవిష్కరణ జరుపుకుంది.


13. గాంధిజీ ప్రాణరక్షకుడు : బతక్ మియా అన్సారి

ఈ పుస్తకం తొలిసారిగా 2019 లో ముద్రితం. 1917లో బీహార్ రాష్ట్రం చంపారన్ లో మహాత్మాగాంధి ప్రాణాలు కాపాడిన సాహసి బతక్ మియా అన్సారి. ఆయన సాహస చరిత్రతో పాటుగా చంపారన్ రైతాంగ పోరాటంలో ముందువరసలో నిలబడిన నాయకత్వం వహించిన రైతాంగ నాయకుడు షేక్ గులాబ్. జర్నలిస్ట్ పీర్ మహమ్మద్ అన్సారి మునిస్‍ల పోరాట చరిత్రలను వివరించే గ్రంధమిది. ఈ గ్రంధాన్ని తెలుగు, ఆంగ్లం, హింది, ఉర్దూ భాషలో 21,000 (21,000) ప్రతుల ప్రచురణ జరిగింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 250 ప్రాంతాలకు ఉచితంగా పంపిణి. మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని పలు రాష్ట్రాలలో ఈ పుస్తకం వందలాది చోట్ల ఆవిష్కరించబడింది. ఆయా రాష్ట్రాలలోని భాషలలో వ్యాసాల పరంపర సాగింది. హింది, ఉర్దూ భాషల్లోని ఈ పుస్తకాన్ని ఉత్తర భారతంలో పలు ప్రచురణ సంస్థలు, వ్యక్తులు కొద్దిపాటి మార్పులు చేర్పులతో పునర్ముద్రించుకున్నారు. ఈనాటికి పునర్ముద్రణలు జరుగుతున్నాయి.


14. అజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సైన్యం) : ముస్లిం పోరాట యోధులు

ఈ గ్రంధాన్ని 2019 లో ప్రచురించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద కాంక్షలను వ్యతిరేకిస్తూ, భరతావనికి ఆంగ్లేయుల నుండి విముక్తి కల్పించాలని భారత దేశం బయటనుండి సాగిన విప్లవోద్యమంలోని ముస్లిం యోధుల కార్యకలాపాలను, భారత జాతీయ సైన్యం, స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు నుండి చిట్టచివరి ఎర్రకోట విచారణ వరకు సాగిన భారత జాతీయ సైన్యం వీరోచిత పోరాటంలో ముస్లిం యోధుల పాత్రను వివరిస్తూ, ఆయా యోధుల, ఆనాటి సంఘటనల అపూర్వ చిత్రాలలో 484 పుటలతో కూడిన గ్రంధమిది.

ఈ గ్రంధాన్ని ప్రచురణకు సహకరించిన వదాన్యుల అభిమతం మేరకు ఇతర గ్రంధాల్లాగున ఈ గ్రంధం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో, తెలుగు గ్రంధాలు కలిగిన ఇతర ఎంపిక చేసిన గ్రంధాలయాలకు, విశ్వవిద్యాలయాలకు, మీడియా సంస్థల గ్రంధాలయాలకు చిరుకానుకగా పంపిణి అయ్యాయి.


15. మహాత్మాగాంధి : ముస్లిం అనుచరులు - సహచరులు

ఈ పుస్తకం 2019 లో తెలుగు ఆంగ్ల భాషల్లో 6000 ఆరు వేల ప్రతుల ప్రచురితం. శ్రీ మోహన్‍దాస్ కరంచంద్ గాంధి ’బారిస్టర్ గాంధి’ నుండి ’మహాత్మాగాంధీ’ అయ్యేంత వరకు, ఆ తరువాత కూడా ఆయనకు తోడ్పాటు ఇచ్చిన సహచరులు, ఆయన వెన్నంటి ఉన్న అనుచరుల వివరాలతో కూడి, అరుదయిన పలు చిత్రాలతో కూడిన పుస్తకమిది.

ఈ గ్రంధం తొలివిడతగా ప్రచురించిన మూడు వేల పుస్తకాలు (తెలుగు) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పంపిణి అయ్యింది. ఆ తరువాత ఆంగ్లంలో మూడు వేల ప్రతులు ప్రచురించిన పుస్తకం మన దేశంలోని వివిధ సాహిత్య-సేవా సంస్థల ద్వారా ఆసక్తి గల పాఠకులకు అందించటంతోపాటుగా ఆయా ప్రాంతాలలోని గ్రంధాలయాలకు పంపిణి అయ్యాయి.


16. బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్య్ర సమర యోధులు, భారతరత్న మౌలానా అఖుల్ కలాం అజాద్

ఈ పుస్తకం 2020లో మూడు వేల ప్రతులు ముద్రితం. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, , భారతరత్న మౌలానా అఖుల్ కలాం అజాద్ 132 వ జయంతి సందర్భంగా 2020 నవంబరు మాసంలో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రచురణ. ఈ గ్రంధాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోని సాహిత్య-సాంస్కృతిక సేవా సంసంస్థలు, మిత్రుల ద్వారా 122 ప్రాంతాలలో వదాన్యుల కానుకగా వివిధ గ్రంధాలయాలకు పంపిణి అయ్యాయి. మౌలానా అఖుల్ కలాం అజాద్ పుట్టిన రోజు నవంబరు 11 సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరుపుకుంది.


17. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు : ఫాతిమా షేక్

ఈ గ్రంధం తెలుగు - ఆంగ్ల భాషల్లో 2021 లో ముద్రితం. మహాత్మాజోతిరావు పూలే, శ్రీమతి సావిత్రిబాయి పూలేలతో కలసి 150 ఏండ్ల క్రితం ’బేటి పడావ్’ ఉద్యమానికి నాంది పలికిన మహిళా రత్నం గురించి భారతదేశంలో మొట్టమొదటి సారిగా 2021లో వెలువడిన చరిత్ర గ్రంధం.

ఈ గ్రంధం తెలుగు భాషలో ప్రచురించిన 5000 ప్రతులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలోని 221 ప్రాంతాలకు వదాన్యుల చిరుకానుకగా పంపిణి చేయగా 172 ప్రాంతాలలో ఆవిష్కరించబడింది.

ఈ గ్రంధం ఆంగ్లానువాదం జూలై 2021 లో 3000 ప్రతులు ముద్రించి తెలుగు భాషేతర రాష్ట్రాలలోని 140 ప్రాంతాలకు వదాన్యుల చిరుకానుకగా పంపిణి జరిగింది. ఆయా ప్రాంతాలలోని వివిధ సాహిత్య సంస్థలు, వ్యక్తుల ద్వారా ఎంపిక చేసిన గ్రంధాలయాలకు, వ్యక్తులకు అందజేయడం జరిగింది.

ఈ గ్రంధం ఇటు తెలుగు రాష్ట్రాలలో, అటు తెలుగు భాషేతర రాష్ట్రాలలోని వందలాది ప్రాంతాలలో విజయవంతంగా ఆవిష్కరణలు జరుపుకుంది. ఆ కారణంగా బహుళ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ గ్రంధం తెలుగు, ఆంగ్లంలో మాత్రమే కాకుండా ఉర్దూ, కన్నడ, హిందీ, మరాఠి భాషల్లో కూడా అనువదించబడి ముద్రితమయ్యింది.


18. ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం : హిందూ - ముస్లిం ఐక్యత

ఈ గ్రంధం 2021 లో ఐదు వేల ప్రతులు ముద్రితం. 1857 నాటి ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామంలో మన దేశం లోని హిందూ-ముస్లిం జనసముదాయాల మధ్యన వ్యక్తం అయిన స్నేహ-సంబంధాలు, బలీయమైన ఐక్యతకు సంబంధించిన వివిధ చారిత్రక సంఘటనలను ఏరి కూర్చిన పుస్తకమిది.

ఈ పుస్తకాన్ని పలువురు వదాన్యుల సహకారంతో ఐదువేల ప్రతులను ముద్రించి రెండు తెలుగు రాష్ట్రాలలోపాటుగా తెలుగు ప్రజలకు గల మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ఇతర ప్రాంతాలకు కూడా పంపిణీ అయ్యాయి. ఆయా ప్రాంతాలలోని వివిధ సాహిత్య సంస్థలు, వ్యక్తుల ద్వారా ఎంపిక చేసిన గ్రంధాలయాలకు, వ్యక్తులకు అందచేయడం జరిగింది.



భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం జనసముదాయాల పాత్రను వివరిస్తూ మొత్తం మీద ఇప్పటివరకు 18 గ్రంధాలు ప్రచురితమయ్యాయి.

ఈ గ్రంధాలు కాకుండా శ్రీ నశీర్ ఇతర పుస్తకాలు కూడా రచించారు. ఆ పుస్తకాల వివరాలు ఇవి :


19. అక్షరశిల్పులు

ఈ పుస్తకం తొలిసారిగా 2010 లో ముద్రితమయ్యింది. ఆ తరువాత శ్రీ నశీర్ మిత్రుల వినతి మేరకు వెంటనే 2011 లో పునర్ముద్రణ అయ్యింది. మూడు వేల ప్రతులు ప్రచురితం.

ఈ గ్రంధంలో తెలుగులో రాసిన-రాస్తున్న 333 మంది ముస్లిం రచయితలు, కవుల సంక్షిప్త పరిచయాలు చోటు చేసుకున్నాయి. కవులు-రచయితల చాయాచిత్రాలు, సాహిత్య కృషి, లక్య్షాలు, ప్రచురితమయిన గ్రంధాలు, పూర్తి చిరునామాలు, సంచారవాణి నంబర్లు, ఈమెయిల్ ఐడీలు కూడా పొందుపర్చడం జరిగింది.


20. కవిరాజు డాక్టర్ ఉమర్ అలీషా.

ఈ పుస్తకం 2012 లో పదివేల ప్రతులు ప్రచురితం. ’ఉమర్ అలీషా పీఠం, పిఠాపురం’ మిత్రుల ద్వారా ప్రచురితమయిన ఈ పుస్తకాన్ని తిరుపతిలో 2012 లో జరిగిన ప్రపంచ మహాసభల సందర్భంగా ఆ పదివేల కాపీలను ’ఉమర్ అలీషా పీఠం, పిఠాపురం’ మిత్రుల ద్వారా మహాసభలకు వచ్చిన ప్రతి ఒక్కరికి అందజేసారు.


21. కువైట్ కబుర్లు

ఈ గ్రంధం 2015 నవంబర్ లో ముద్రితం. ఈ గ్రంధాన్ని కువైట్ లోని ’కడప ఇస్లామిక్ వెల్ఫేర్ ట్రస్ట” కు చెందిన శ్రీ నశీర్ మిత్రులు ప్రచురించారు. కడప ఇస్లామిక్ వెల్ఫేర్ ట్రస్ట్ 30 వ వార్షికోత్సవం, భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంగా తొమ్మిది రోజులపాటు కువైట్ లో శ్రీ నశీర్ జరిపిన పర్యటన విశేషాలతో కూడిన గ్రంధమిది.


ఈ గ్రంధాలు కాకుండా పలు సందర్భాలలో శ్రీ నశీర్ విరచిత గ్రంధాలను కొన్ని వివిధ సంస్థలు, వ్యక్తుల ఆర్ధిక సహకారంతో చిరుపొత్తాలుగా ప్రచురించి ప్రజలలో ఉచితంగా పంపిణి చేయడం జరిగింది.

రచనలో ఉన్న శ్రీ నశీర్ గ్రంధాలు :


1. చిరస్మరణీయులు –2

బ్రిటిష్ వ్యతిరేక పొరాటాలలో పాల్గొన్న వందలాది ముస్లిం యోధుల సంక్షిప్త పరిచయాలు, ఆ స్వాతంత్య్ర సమర వీరుల చిత్రాలు, ఫొటోలతో...


2. భారత స్వాతంత్య్ర సంగ్రామం : ముస్లిం యోధులు ( రెండవ, మూడవ, నాల్గవ భాగాలు)

నాలుగు సంపుటాలుగా మొత్తం 14 వందల పేజీలు రాగల ఈ గ్రంధాలలో 500 మందికి పైగా స్వాతంత్య్ర సమర యోధుల జీవిత రేఖా చిత్రాలు, మరో రెండువేల మంది స్వాతంత్య్ర సమర వీరుల సంక్షిప్త వివరాలు ఇవ్వాలన్నది ప్రయత్నం.


3. చరిత్ర సృష్టించిన ముస్లిం మహిళలు

ప్రజా జీవనరంగాలన్నింటిలో తమదైన ప్రతిభ చూపిన వంద మంది మహీళల జీవిత రేఖా చిత్రాలు. నాటి డిల్లీ సామ్రాజ్ఞి రజియా సుల్తానా నుండి నేటి సానియా మీర్జా వరకు.


4. మాతృభూమి సేవలో చరితార్ధులైన ముస్లిం ముద్దు బిడ్డలు

భారత దేశానికి స్వాతంత్య్రం లభించాక జరిగిన అభివృద్ది - ప్రగతిలో భాగస్వాములై వివిధ రంగాలలో తమదైన ప్రతిభతో చరిత్రను సృష్టించిన వందమంది గురించి సమాచారం


5. దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత : దాదా అమీర్ హైదర్ ఖాన్

దక్షణ భారత దేశంలో కమ్యూనిస్టు విత్తనాలను నాటిన యోధులు, కమ్యూనిస్టు ప్రముఖులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ కంబంపాటి సీనియర్ లాంటి యోధులకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని పరిచయం చేసిన తొలితరం కమ్యూనిస్టు జీవితచరిత్ర


6. చరితార్ధులు – 2

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న 155 మంది సమరయోధుల చిత్రాలు, వారి సంక్షిప్త వివరాలతో ఇటు ఆంగ్లం అటు తెలుగు భాషలో పేర్కుంటూ వెలువడనున్న ఆల్బం.


7. అండమాను జైలు : ముస్లిం స్వాతంత్ర్య సమరయోధులు

1858 నుండి 1945 వరకు అండమాను శిక్షాక్షేత్రానికి పంపబడిన ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల వివరాలతో కూడిన గ్రంధమిది.


గత రెండున్నర దశాబ్దాలుగా శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ సాగిస్తున్న కృషికి గుర్తింపుగా

1) వి.ఆర్ నార్ల విశిష్ట జర్నలిస్టు అవార్డు (విజయవాడ, 2004)

2) తెలుగు భాషా పురస్కారం (గుంటూరు, 2007)

3) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు (న్యూఢిల్లీ, 2008)

4) స్వాతంత్ర్య సమరయోధుడు ఆఫ్యాఖుల్లా ఖాన్ స్మారక అవార్డు (హైదరాబాద్, 2010)

5) బి.యస్ రాములు పురస్కారం (హైదరాబాద్, 2011)

6) కవిలోకిల దిన సుబ్బయ్య స్మారక పురస్కారం గుంటూరు, 2012

7) సంఘమిత్ర అవార్డు (బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, హైదరాబాద్, 2013)

8) మాస్టార్ ఫౌండేషన్ సేవారత్న పురస ్కారం, (విశ్వజన కళా మండలి, హైదరాబాద్, 2015)

9) జీవిత సాఫల్యా పురస్కారం (శ్రీమతి జ్యోతిబాయి ఫూల్ ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం, 2016)

10) ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 2018)

11) విశిష్ట సేవా పురస్కారం (నరసరావుపేట కళావేదిక, 2018)

12) జనోపకారి ఆత్మీయ పురస్కారం (జనోపకారి మాస పత్రిక, కావలి, 2016)

13) ప్రొద్ ఆత్మీయ పురస్కారం (హైదరాబాద్ 2016)

14) లోక్ బంధు సద్భావనా సమ్మాన్ జాతీయ పురస్కారం (లక్నో, ఉత్తరప్రదేశ్ 2017)

15) కీర్తి పురస్కారం (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 2015)

16) మహారాష్ట్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ (కవితాసాగర్ పబ్లికేషన్స్, జయ సింగపూర్, మహారాష్ట్ర, 2018)

17) సృజన ప్రియ పురస్కారం". (సృజన ప్రియ మాసపత్రిక, హైదరాబాద్, 2018)

18) 'డాక్టర్ పట్టాభి ప్రతిభా పురస్కారం" డాక్టర్ పట్టాభి కళాపీఠం, విజయవాడ, 2018)

19) రాష్ట్రస్థాయి ఉత్తమ తెలుగు జర్నలిస్టు అవార్డు (కడప, 2018)

20) "మాటి రతన్ పురస్కారం -2018" (అష్ఫాఖుల్లా ఖాన్ స్మారక అమర వీరుల పరిశోధనా సంస్థ, ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్, 2015)

21) గిడుగు రామూర్తి పురస్కారం (గిడుగు రామూర్తి ఫౌండేషన్, హైదరాబాద్, 2019)

22) సురా సాహిత్య- సామాజిక సేవా పురస్కారం (శ్రీమతి జ్యోతిబాయి ఫూలే ఎడ్యుకేషనల్, చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం, 2019)

23) ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఇచ్చే "జ్ఞానజ్యోతి" పురస్కారం 2021

24) డాక్టర్ ఉమర్ ఆలిషా స్మారక జాతీయ పురస్కారం (డాక్టర్ ఉమర్ అలిషా సాహితీ సమితి, భీమవరం, 2021)


బహుళ రాష్ట్రాల, దేశాల పత్రికల క్లిప్పింగ్స్

విస్మృత చరిత్రను అన్వేషించి అక్షరూపం కల్పించి, గ్రంథాలను వెలువరించి, ప్రచారంలోకి తెస్తున్న నశీర్ అహమ్మద్ విశిష్ట ప్రయత్నాలను గమనించిన తెలుగు భాషా పత్రికలు మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి భాషా పత్రికలు కూడా ఆయన కృషిని ప్రశంసించాయి. ఈమేరకు ఆంగ్లం, ఉర్దూ, మలయాళం, హిందీ, తమిళ, గుజరాతీ కన్నడ, మరాఠీ, అరబిక్ భాష పత్రికలు పలు వ్యాసాలు / వార్తలు ప్రచురించాయి. మన తెలుగు రాష్ట్రాలలోని పత్రికలు, ఇతర రాష్ట్రాల పత్రికలు మాత్రమే కాకుండా పాకిస్థాన్, కువైట్ లాంటి దేశాలలోని ఉర్దూ / అరబిక్ పత్రికలు కూడా సయ్యద్ నశీర్ అహమ్మద్ కృషిని బహుదా ప్రసంసించాయి. ఇవిగోండి బహుళ భాషా పత్రికలు మాత్రమే కాకుండా, బహుళ రాష్ట్రాల, దేశాల పత్రికల క్లిప్పింగ్స్.


Mr Syed Naseer Ahammed

ApnaTV ఛానల్

ప్రముఖ చరిత్రకారులు శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ApnaTV ఛానల్ ను రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. మనం మరచిన స్వాతంత్య్ర సమర యోధుల విశేషాలతో ప్రజలు మరింతగా చేరువ చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో "ApnaTV - ఇది మీ టీవీ - మనందరి టీవీ" అంటూ సభ్యులుగా చేరమని ఆహ్వానం పలికారు. చరిత్ర శోధనలతో బిజీ షెడ్యూల్ తో ఉన్న శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ApnaTV యూట్యూబ్ ఛానల్ ఇంకా అరంభించలేక పోయారు. ApnaTv త్వరగా ప్రారంభం కావాలని ఆశిస్తూ ... ApnaTV యూట్యూబ్ ఛానల్ కోసం శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ కొంత సమయం కేటాయించాలని కోరుతున్నాను.

ApnaTV ఛానల్ కు సబ్‍స్క్రయిబ్ కాని వారు సబ్‍స్క్రయిబ్ అయ్యి శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ను ప్రోత్సహించాలని ఆయన మిత్రబృందాన్ని, ప్రజలను, నశీర్ మిత్రునిగా నేను కోరుతున్నాను.



భారత స్వాతంత్రోధ్యమంలో ముస్లింల పోరాట చరిత్ర పరిశోధనలు, ఉచిత పుస్తకాలు' శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ పరిచయ వీడియో






బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Prasad Sarma
Dr Tata Seva Kumar
Dr Banda Jawahar
Dr K Naga Malleswara Rao
Mr Dasari Rama Muthy
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Nallapati Satyanarayana
Mr PV Uma Maheswara Rao
www.bandla.app Image
www.bandla.app Image
www.bandla.app Image