శ్రీ పేరిబోయిన వెంకట ఉమా మహేశ్వర రావు



Mr Periboina Venkata Uma Maheswara Rao

గిల్లికజ్జాలతో గడిచే బాల్యం

చదువు ఆట పాటలు తోటి స్నేహితుల గోలలు గిల్లికజ్జాలతో గడిచే బాల్యాన్ని తన పదిహేనవ ఏట ఎదురైన ఆకస్మిక దుర్ఘటన, తన తండ్రి మరణించడం వంటి అతి విషాధ ఘటన తో, తల్లి భాధ్యతను తానే చూసుకోవాలని పట్టుబట్టి, మెరిట్ లో మొదటి గా ఉన్న చదువులకు, క్రీడలకు సయితం స్వస్తి పలికి బ్రతుకు బండిని సజావుగా నడిపించటానికి, ఎటువంటి పెట్టుబడి లేని రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని మార్కెటింగ్ ఏజంట్ గా చేరి అనేక అవార్డులు, రివార్డులతో అంచలంచెలుగా డైరెక్టర్ హోదాకు ఎదిగి ఎందరెందరికో ఉపాదికి మార్గాలు చూపుతూ, బిల్డర్ దిశగా నేడు అడుగులు వేస్తున్నారు శ్రీ పేరిబోయిన వెంకట ఉమా మహేశ్వర రావు.


సోషల్ సర్వీస్

యువజన సంఘ కార్యకర్తగా, ప్రముఖ సర్వీసు ఆర్గనైజేషన్ కు సభ్యులుగా ఉండి అనేక సేవా కార్యక్రమాలలో, రక్తదాన శిబిరాలలో పాల్గొని పేదలకు ఉచిత మందులు, రక్తదానం వంటి విశేషమయిన సేవలను పలు మార్లు అందించారు.


తల్లి తండ్రులు

స్వర్గీయ శ్రీమతి అంజమ్మ గారు స్వర్గీయ శ్రీ రామయ్య గారు జన్మస్థలం : గుంటూరు బ్రాడీ పేట 1965 వ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేది


విద్యాభ్యాసం

ఒకటి నుండి ఐదవ తరగతి వరకు శ్రీ శారదా నికేతనము, గుంటూరులో, ఆరు నుండి పదవతరగతి వరకు శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ , గుంటూరులో ఇంటర్‍మీడియట్ హిందూ కాలేజ్ గుంటూరు లో చేసారు.


కుటుంబం

వివాహితులు సహచారిణి శ్రీమతి రత్న కుమారి, ఒక కుమారుడు ప్రణవ్


వృత్తి

రియల్ ఎస్టేట్ కన్సల్‍టెంట్ ప్రవృత్తి : క్రీడలు కబడ్డి ప్లేయర్, బాక్సింగ్, గుంటూరు కొరిటెపాడు వాకర్ అసోసియేషన్ లో లైఫ్ మెంబర్‍గా ఉన్నారు.






అవార్డులు, రివార్డులు

బాక్సింగ్ లో బెస్ట్ బాక్సర్ గా అప్పటి క్రీడా మంత్రిగారైన శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మార్కెటింగ్ ఏజంట్ గా అందించిన పలుసేవలకు గుర్తింపుగా రియల్ ఎస్టేట్ సంస్థ వారు అనేక అవార్డులు, రివార్డులతో డైరెక్టర్ హోదాకు చేరారు.


ఉపాధి మార్గాలు, శిక్షణ

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజంట్ గా చేరాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నారు. యువతకు ఉపాధి కల్పిస్తూ, శిక్షణా శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు.


ఫోన్ నంబర్

రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ గురించి ఏమైనా సందేహాలను 7981284993 నంబర్ కు ఫోన్ చేసి సమాధానాలను తెలుసు కోండి అని అంటున్నారు శ్రీ పేరిబోయిన వెంకట ఉమా మహేశ్వర రావు గారు.


అభినందనీయులు

చదువుల్లోను, ఆటల్లోను ఎప్పుడూ ముందుండి కూడా ఎదురైన పరిస్థితుల ప్రభావాలతో వాటికి స్వస్థి పలికి, ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి నీతీ నిజాయితీ ని పెట్టుబడిగా పెట్టి అంచలంచెలుగా ఎదిగి తనదైన వృత్తిలో రాణిస్తూ పలువురికి మార్గదర్శకంగా ఉపాది మార్గాలను చూపుతున్న శ్రీ పేరిబోయిన వెంకట ఉమా మహేశ్వర రావు గారు అభినందనీయులు.



బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Syed Naseer Ahamed
Dr Tata Seva Kumar
Dr Banda Jawahar
Dr K Naga Malleswara Rao
Mr Dasari Rama Muthy
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Nallapati Satyanarayana
Mr Prasad Sarma
Mr PV Uma Maheswara Rao
www.bandla.app Image
www.bandla.app Image