శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ



Mr Chintakunta Prasad Sarma

ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి గా

సరదాగా నేర్చుకున్న టైప్, షార్ట్ హాండ్ విధ్యలతో ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలతో అతి తక్కువ జీతం నుండి, ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అత్యున్నతమైన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి గా ఎదిగిన బాల్య మిత్రులు శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ జీవితాన్ని చదువుతుంటే లేదా వింటుంటే, అత్యంత అరుదుగా ఏ కొద్దిమందికో లభించే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొలువులో గ్రూప్ వన్ హోదాకు ఎదగడం ప్రతి ఒక్కరూ శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ కు అభినందనలు తెలుపవలసిన విషయమే!


పాకెట్ మనీ కోసం

అయినప్పటికీ ఇది కేవలం తన పాకెట్ మనీ కోసం, తన సర్దాలు తీర్చుకోవడానికి ఇల్లు వదలి తన స్వశక్తి తో మాత్రమే సాధించుకున్నటువంటి అత్యంత అరుదైన ఒక ప్రత్యేకతతో కూడి ఉన్నటువంటి సంఘటనను చూస్తుంటే ప్రతి ఒక్కరి మదిలో మన పురాణ కధలలోని వాల్మీకి మహర్షి, భక్త కన్నప్ప గుర్తుకు వస్తారు.


సంపాదన దిశగా

శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ నాన్న గారు ప్రధానోపాధ్యాయులుగా పని చేసెడివారు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ, భాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ ను సత్ప్రవర్తనలోకి తెచ్చుకోడానికి పాకెట్ మనీ ఇవ్వడం మానివేశారు. కేవలం పాకెట్ మనీ కోసం, పంతంతో నేను నేనుగా బతక గలను అనే ధీమాతో ఉన్నత చదువులకు సయితం స్వస్తి పలికి, సంపాదన దిశగా అడుగులు వెయ్యడం, ఆ అడుగులు ఊరూ ఊరూ మారుతూ చివరికి హైదరాబాద్ చేరడం తన జీవితాన్ని మార్చి వేసింది.


తల్లిదండ్రులు

తల్లిదండ్రులు శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారు, శ్రీ నరసింహారావు గారు

పుట్టుక : శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ 1957 వ సంవత్సరం జూలై నెల 17 వ తేదీన వినుకొండ మండలం వేల్పూరు గ్రామంలో జన్మించారు. విద్య బిఎస్సి., టైప్ హైయ్యర్ మరియు షార్ట్ హ్యాండ్


కుటుంబం

లక్ష్మి గారితో వివాహం జరిగినది. ఇద్దరు సంతానం, కుమారుడు హైదరాబాద్ లో ఒక మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో IC గా చేస్తున్నారు. అమ్మాయి హౌస్ వైఫ్ అల్లుడు మల్టీ నేషనల్ కంపెనీలో టీం లీడర్ గా పని చేస్తున్నారు.






విధ్యా విషయాలు

విద్య బిఎస్సి., టైప్ హైయ్యర్ మరియు షార్ట్ హ్యాండ్ ప్రాధమిక విధ్య వేల్పూరు గ్రామంలో, ఆరవ తరగతి, ఏడవ తరగతి నరసరావుపేట ప్రకాష్ నగర్ మునిసిపల్ తిలక్ సీనియర్ బేసిక్ స్కూల్ లో ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు మునిసిపల్ హైస్కూల్ నరసరావుపేటలో, ఇంటర్మీడియట్, బిఎస్సీ నరసరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజ్ లో చేశారు.


ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమీషన్

హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమీషన్ లో ఎంపికై ప్రభుత్వ ఉద్యోగం లోకి చేరారు. జిల్లా ట్రెజరీ అధికారిగా, అడిషనల్ కమీషనర్ గా మునిసిపల్ కార్పోరేషన్ కర్నూల్ లో, స్టేట్ ఫైనాన్స్ ఆఫీసర్ గా సాంఘిక సంక్షేమ శాఖ హైదరాబాద్ లో పనిచేశారు. ఉద్యోగ బాద్యతలలో భాగంగా అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి దగ్గర పి.ఏ., అడిషనల్ పి.ఎస్., ముఖ్యమంత్రి దగ్గర పర్సనల్ సెక్రటరీ, పౌర సరఫరాల శాఖా మంత్రి దగ్గర పి.ఏ., ఇరిగేషన్ మంత్రి దగ్గర పి.ఎస్., చివరిగా సివిల్ సప్లయ్స్ శాఖలో డిప్యూటీ డరెక్టర్ హోదాలో


విశ్రాంత జీవితం

2017వ సంవత్సరం జూలై నెల 31 వ తేదీన విజయవాడలో ఉద్యోగ విరమణ చేసి, స్వంత అపార్ట్ మెంట్ హైదరాబాద్ లో బార్య పిల్లలతో విశ్రాంత జీవితం గడుపుతున్న శ్రీ చింతకుంట ప్రసాద్ శర్మ జీవితం అభినందనీయం.



బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Syed Naseer Ahamed
Dr Tata Seva Kumar
Dr Banda Jawahar
Dr K Naga Malleswara Rao
Mr Dasari Rama Muthy
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Nallapati Satyanarayana
Mr PV Uma Maheswara Rao
www.bandla.app Image
www.bandla.app Image
www.bandla.app Image