శ్రీ నల్లపాటి సత్యనారాయణ



Mr Nallapati Satyanarayana

గ్రామాభివృద్ది కార్యక్రమాలకు

తల్లిదండ్రులు కస్టార్జితంతో సంపాదించుకున్న ఆస్థిలో తన వాటాగా వచ్చిన ఎనిమిది ఎకరాల పొలాన్ని మొత్తమూ తన జన్మస్థలమైన జొన్నలగడ్డ గ్రామాభివృద్ది కార్యక్రమాలకు వినియోగించిన మన మిత్రుడు శ్రీ నల్లపాటి సత్యనారాయణను పొగడాలో తెగడాలో అనే మీమాంసలో ఉండవచ్చు ఎవరయినా. ఇది ఒక కోణంలో చూస్తుంటే కించిత్ బాధ కలుగుతున్నా మరో కోణంలో చూస్తూంటే జొన్నలగడ్డ గ్రామ వాసుల మదిలో స్థిరస్తాయిగా నిలిచిపొయిన మంచి ధర్మకర్తగా వెలిగిపోతున్నారు.


తల్లిదండ్రులు

శ్రీ నల్లపాటి సత్యనారాయణ అమ్మ, నాన్నలు కీర్తి శేషులు శ్రీమతి రంగమ్మ గారు, కీర్తి శేషులు శ్రీ క్రిష్ణయ్య గారు ఇద్దరూ నరసరావుపేటలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద పాల వ్యాపారం నడిపినారు.


విద్యాభ్యాసం

ప్రాధమిక విద్య ఐదవ తరగతి వరకూ నరసరావుపేట వాషర్‍మన్‍పేట లోని శ్రీ విశ్వరూపాచారి గారి వద్ద, ఆరవ తరగతి నుండి పదవతరగతి వరకూ నరసరావుపేట మునిసిఫల్ హైస్కూల్ లోను, ఇంటర్ మీడియట్ శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో సాగినది. శ్రీ నల్లపాటి సత్యనారాయణ నరసరావుపేట మునిసిఫల్ హైస్కూల్ లో ఆరవ తరగతి నుండి పదవతరగతి వరకూ ఐదు సంవత్సరాలు సెక్షన్ లీడర్ గాను, కబడ్డీ కెప్టన్ గానూ ఉన్నారు. అయితే ఇంటర్ తోనే చదువుకు స్వస్తి చెప్పి వ్యవసాయం పై ధృష్టి పెట్టి, అరక దున్నటం, గేదలు మేపటం వంటి పనులతో తల్లిదండ్రులకు సహకారమందించినారు.


కుటుంబ సభ్యులు

ఇరువది సంవత్సరాల వయస్సు లో ఉమాదేవి గారితో పెళ్ళి జరిగింది. ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ యం.సి.ఏ. చేశారు. పెద్దల్లుడు, పెద్దమ్మాయి ఇద్దరూ హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్దల్లుడు నాట్కో పార్మాస్యూటికల్స్ లో మార్కెటింగ్ మేనేజర్, చిన్నమ్మాయి, చిన్నల్లుడు అమెరికాలో చేస్తున్న జాబ్ వదులుకొని, ఇటీవలనే వారు కూడా హైదరాబాద్ లో మంచి ఉద్యోగాలలో స్థిరపడినారు. నలుగురు మనవరాళ్ళు, ఒక మనవడు పెద్ద మనవరాలు అమెరికాలో యంఎస్ చేసి అక్కడే జాబ్ చేస్తున్నారు. రెండవ మనవరాలు ఐ ఐ టి చేస్తున్నారు. చిన్నమనవరాళ్ళు ఇద్దరూ, చిన్న మనవడు ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నారు.






అభివృద్ది కార్యక్రమాలు

శ్రీ నల్లపాటి సత్యనారాయణ విషయాలలో అన్నిటికన్నా ముఖ్యమయినది తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యునిగా పదహారు సంవత్సరాలు శ్రీ కోడెల శివ ప్రసాద రావు గారి నాయకత్వాన పనిచేయడం జరిగినది. ఆ సమయంలోనే జొన్నలగడ్డ గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలు పరుగులు పట్టించడంలో భాగంగా 1293 వ సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి చేత నిర్మితమైన వేణుగోపాలస్వామి వారి దేవాలయాన్ని పునః నిర్మాణం చేయడం, కళ్యాణ మండప నిర్మాణం, రక్షిత మంచి నీటి పధకం, పొలాలు వెళ్ళటానికి రోడ్లు, కమ్యూనిటీ హాల్ మొదలైన ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఆ రోజుల్లలోనే కోటి రూపాయలను గ్రామాభివృద్దికి ఖర్చు చేయడం జరిగింది. ఈ అభివృద్ది కార్యక్రమాలను అమలు చేయడం కోసమే శ్రీ నల్లపాటి సత్యనారాయణ వాళ్ళ నాన్నగారిచ్చిన ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముకున్నారు.


రాజకీయాలకు స్వస్తి

తన యావదాస్థి పూర్తిగా హారతి కర్పూరంలా కరగి పోయిన తదుపరి మన సత్యనారాయణకు కనువిప్పు కలిగింది. పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలికి తన తోటి మిత్రుల నుండి కొంత పెట్టుబడిని అప్పుగా తీసుకొని, ఫర్టిలైజర్ షాపును, డైరీ ఫామ్ ను, చిన్న చిన్న ఆర్ అండ్ బి కాంటాక్ట్ పనులను చేసి అప్పులన్ని తీర్చుకొని, ప్రస్తుతం ఇంటి వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకొని, ఒక్కొక్క మెట్టును పైకెక్కుతూ స్వశక్తి తో మంచి సంపాదనలతో, ఆర్ధిక ఇబ్బందులంటూ ఏమీ లేకుండా నేడు ఆహ్లాద వాతావరణంలోకి అడుగు పెట్టిన శ్రీ నల్లపాటి సత్యనారాయణ అభినందనీయులు.


ఆర్ధిక తోడ్బాటును అందిస్తున్నారు

నేడు కూడా జొన్నలగడ్డ గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు, స్కూళ్ళకు, చదువుకునే పిల్లలకు, బీదవారికి తనవంతు ఆర్ధిక తోడ్బాటును అందిస్తున్నారు. శ్రీ నల్లపాటి సత్యనారాయణ తయారు చేసుకున్న పుస్తకము "జొన్నలగడ్డ గ్రామ చరిత్ర - నల్లపాటి వారి వంశ వృక్షము" ఈ మధ్యనే పబ్లిష్ చేశారు. శ్రీ నల్లపాటి సత్యనారాయణ బర్త్ డే మే నెల పదవ తేది




బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Syed Naseer Ahamed
Dr Tata Seva Kumar
Dr Banda Jawahar
Dr K Naga Malleswara Rao
Mr Dasari Rama Muthy
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Prasad Sarma
Mr PV Uma Maheswara Rao
www.bandla.app Image
www.bandla.app Image
www.bandla.app Image