ముఖపుస్తక మిత్రులు శ్రీ గద్దపాటి శ్రీనివాసు గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు
సాహిత్యాభిలాషులు
ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిలాషులు, ఉపన్యాసకులు, రచయిత, విద్యావేత్త గా వివిధ రంగాలలో పయనిస్తున్న తన జీవిత చక్రం మూడు కథలు ఆరు కవితలు గా ఎటువంటి ఒడు దుడుకులు లేకుండా సాగి పోతున్నదని చెప్పవచ్చు
జన్మ స్థలం
ఖమ్మం జిల్లా గార్ల మండలం జీవంజిపల్లి గ్రామం
తల్లి దండ్రులు
శ్రీమతి రత్నమ్మ గారు. శ్రీ రాజయ్య గారు
కుటుంబం
వివాహితులు సహచారిణి శ్రీమతి ప్రభారాణి గారు
ఇద్దరు ఆడపిల్లలు రాజశ్రీ, రచన
బహు విద్యావేత్త
శ్రీ గద్ద పాటి శ్రీనివాసు గారు బహు విద్యావేత్త. అనేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఎం.ఏ(తెలుగు), ఎం.ఏ(హిందీ), ఎం.ఏ(ఆంగ్లం), ఎం.ఎస్సీ(సైకాలజీ), బి.ఇడి, టి.ఫి.టి. చే సారు
కథలు, కవితలు
శ్రీ గద్ద పాటి శ్రీనివాసు గారు సాహిత్యాభిలా షీ వారు వ్రాసిన అనేక కథలు, కవితలు మూసీ ఆకాషిక్, ఈనాడు,.వార్త, అంద్రజ్యోతి, నవతెలంగాణ. మొదలగు పత్రికలలో వచ్చాయి.
సిల్వర్ జూబ్లీ
శ్రీ గద్ద పాటి శ్రీనివాసు స్కూల్ అసిస్టెంట్ (హిందీ) గా ఉద్యోగం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఇటీవలి కాలంలో ఇరువది ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు,
విధ్యాభిలాషి
ఓ సామాన్య కుటుంబంలో పుట్టి స్కూల్ అసిస్టెంట్ గా తన విధులకు ఎటువంటి భంగం వాటి ల్ల కుండా అనేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నత విద్యలు పూర్తి చేసిన శ్రీ గద్దపాటి శ్రీనివాసు గారు అభినందనీయులు
శ్రీ గద్దపాటి శ్రీనివాసు రచనలు కొన్ని
1. "పంచమస్వరం" (కవితాసంకలనం) 2019
2. "స్వేచ్చకోసం"(ఖమ్మంజిల్లా కవులసంకలనం) 2008 కి సంపాదకత్వం
3."కొత్తతొవ్వ "(కవితా సంకలనం 2018) లో కవితలు
4."గుమ్మం" ఖమ్మంజిల్లా కవుల సంకలనం లో కవిత
5. "మార్పుకోసం "కవితాసంకలనం లో కవిత
6."ప్రజచైతన్యకవనం" కవితాసంకలనం లో కవిత
7. "సాహిత్య సౌరభాలు "సంగారెడ్డి జిల్లా కవితాసంకలనం లో కవిత
8. "ఈనాటికవిత" కవిసంగమం వారి సంకలనం లో కవిత
9. "జాగో జగావో "తెలంగాణ ఉద్యమ కవితాసంకలనం లో కవిత
10. "క్విట్ తెలంగాణ" కవితా సంకలనం లో కవిత
11."అడుగు" తెలంగాణ సాహితి కవితా సంకలనంలో కవిత
12."సఫాయిలం" కవితాసంకలనంలో కవిత
13. "తెలుగే ఒక వెలుగు" కవితాసంకలనం లో కవిత
14. "కవిసంగమం 2012" లో కవిత
15."మునుం" తెలంగాణ ఉద్యమకవిత్వం లో కవిత
16. "నల్లస్వప్నం" కవితాసంకలనం లో కవిత
17."అక్షరాలతోవ" కవితా సంకలనంలో కవిత
18."ఆసిఫాకోసం" కవితాసంకలనం లో కవిత
19."ఖమ్మం కథలు" కథా సంకలనం లో కథ
20."లోగిలి "సాహితిస్రవంతి కవితా సంకలనంలో కవిత
21."సారంగ" అంతర్జాల పత్రికలో కథ
22. "వాకిలి "అంతర్జాలపత్రికలో అనువాద కవితలు
23. " తొలి పొద్దు "తెలంగాణ రాష్ట్ర కవితాసంకలనంలో కవిత
24. "వినియోగం" వినియోగదారుల సంక్షేమం పుస్తకం లో కవిత
25 "తెలంగాణ దళిత కథలు " కథా సంకలనంలో కథ.
బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.