శ్రీ దాసరి రామ మూర్తి



Mr Dasari Rama Murthy

కో - ఆపరేటివ్ బ్యాంక్ ఆఫీసర్ గా

కో - ఆపరేటివ్ బ్యాంక్ ఆఫీసర్ గా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవనం గడుపుతున్న బాల్య మిత్రుడు శ్రీ దాసరి రామ మూర్తి లాయర్ అవుదామన్న తన జీవితాశయం నెరవేరలేదన్న నిరాశ, చిన్నప్పుడే తన తోటి బాల్య మిత్రుడు చనిపోయాడన్న బాధ ఈ రెండు సంఘటనలు తన జీవన ప్రయాణ ఆరంభంలో జరిగాయి తప్పితే మిగిలిన జీవిత ప్రయాణమంతా పొగలు రాని ఎలక్ట్రానిక్ బండిలా ఎటువంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా సాగి పోతున్నదని చెప్పవచ్చు.


మితభాషి, మంచి పొదుపరి

శ్రీ దాసరి రామ మూర్తి మితభాషి, మంచి పొదుపరి. ఎటువంటి పొదుపరి అంటే, చివరికి స్నేహితుల విషయంలో కూడా, తాను చదివిన బి.యస్సీ., డిగ్రీ మొత్తం ఇద్దరే ఇద్దరు స్నేహితులతో మాత్రమే ఫ్రెండ్‍షిప్. ఇద్దరు కాదు తనతో కలిపి ముచ్చటగా ముగ్గురు మిత్రులు అవుతారు - త్రిమూర్తుల మిత్ర త్రయం


మిత్ర త్రయం

వారు శ్రీ వి. ఎస్. ఆర్. అవధాని, శ్రీ ఆంజనేయులు మరియు శ్రీ దాసరి రామ మూర్తి. సినిమాలు, షికార్లకే పరిమితం కాకుండా శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల వేడుకల్లో సయితం నాటకాలు, వేషాలు వేయడంలోనూ ఆ మిత్ర త్రయం పాత్రలు మరచిపోలేని, అప్పటి చిన్ననాటి బంగారు రోజుల జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నా మదిలో. అయితే ఆ మిత్ర త్రయంలోని శ్రీ ఆంజనేయులు చిన్నతనంలోనే అకాల మరణం చెందడం వారికే కాకుండా ఇది చదువుతున్న లేదా వింటున్న ప్రతి ఒక్కరికీ, కించిత్ బాధాకరమైన విషయం.


గుళ్ళు గోపురాలకు దానం

శ్రీ దాసరి రామ మూర్తి చిన్నతనంలో ఎంత పొదుపరి అయినా పెద్దయినాక బ్రేక్ పడిందని చెప్పవచ్చు, తనకున్న ఆదాయంలో కొంత గుళ్ళు గోపురాలకు దానం చేస్తుండడం చూస్తుంటే, అట్లానే దైవ సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతుండడం వంటి విషయాలు చూస్తుంటే తనకు దైవ భక్తి ఎక్కువగా ఉన్నదని కూడా అర్ధమవుతుంది ఇట్టే ఎవరికయినా!


తల్లి దండ్రులు :

తల్లి దండ్రులు స్వర్గీయ శ్రీమతి వెంకట రత్నం గారు, స్వర్గీయ శ్రీ దాసరి రామకృష్ణయ్య గారు.

శ్రీ దాసరి రామ మూర్తి పుట్టుక గుంటూరులో 23 October, 1955 తేదీన


Status :

వివాహితుడు, సహచారిణి శ్రీమతి గీతాంజలి గారు. వీరి వివాహం 07 March, 1985 తేదీన జరిగినది.

సంతానం : ఇద్దరు పిల్లలు. కుమారుని పేరు హర్షవర్ధన్ అమెరికాలో చేస్తున్న జాబ్ మానుకొని నేడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. కూతురు పేరు శ్రీమతి ప్రశాంతి. అల్లుడూ కూతురు ఇద్దరూ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు.






విధ్యాభ్యాసం :

విధ్యాభ్యాసం విషయానికి వస్తే ప్రాధమిక విద్య నుండి డిగ్రీ వరకూ చదువులు ఒకే ఊరిలో సాగలేదు. శ్రీ దాసరి రామ మూర్తి నాన్న గారు రిజిస్ట్రార్ గా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వారి బదిలీలననుసరించి ప్రాధమిక విధ్య నుండి ఇంటర్మీడియట్ వరకూ మాచర్ల లోనూ, బి ఎస్ సి నరసరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కాలేజ్ లోనూ సాగినది.


ప్రశాంత విశ్రాంత జీవితం :

హైదరాబాద్ లో నేడు సొంత అపార్ట్‍మెంట్ తో స్థిర నివాసమేర్పరచుకొని, ఆ అపార్ట్‍మెంట్ సెక్రటరీ గా ఎన్నికై, అపార్ట్‍మెంట్ సెక్రటరీ హోదాతో అపార్ట్మెంట్ లో ఉన్న ఇరువది ఐదు కుటుంబాల సభ్యులకు అనేక సేవలందిస్తూ తన ప్రశాంత విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు శ్రీ దాసరి రామ మూర్తి.


దేవాలయాలకు డొనేషన్స్ :

శ్రీ దాసరి రామ మూర్తి హైదరాబాద్ నిజాంపేట సెవన్ హిల్స్ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి, శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి, అట్లానే తను పుట్టిన గుంటూరు గోరంట్ల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఒక్కొక్క దేవాలయానికి ఇరువది ఐదు వేల రూపాయల డొనేషన్స్ అందించి ఆయా దేవాలయాల అభివృద్దికి తన వంతు సహకారాలు అందించిన శ్రీ దాసరి రామ మూర్తి గారు అభినందనీయులు.



బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Syed Naseer Ahamed
Dr Tata Seva Kumar
Dr Banda Jawahar
Dr K Naga Malleswara Rao
Mr Prasad Sarma
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Nallapati Satyanarayana
Mr PV Uma Maheswara Rao
www.bandla.app Image
www.bandla.app Image
www.bandla.app Image