వైద్యం ఎవరికీ కారాదు ఆర్థిక భారం
రచయిత, జర్నలిస్ట్, పత్రికా సంపాదకులు, రాజకీయాలలో సయితం ప్రవేశించిన వైద్యులు డాక్టర్ తాతా సేవ కుమార్ 1996 సంవత్సరం లో గుంటూరు కేంద్రంగా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ (S.H.O.) సంస్థను ప్రారంభించి ప్రజారోగ్య చైతన్య సభలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆరోగ్యానికి హానికరమైన న ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు, గుట్కా వంటి దురలవాట్లకు వ్యతిరేకంగా రాజీ పడని పోరాటం చేస్తూ, సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులను ప్రత్యక్షంగా చవిచూసిన అనుభవంతో వైద్యం ఎవరికీ కారాదు ఆర్థిక భారం అనే నినాదంతో అతి తక్కువ ఖర్చు కే సాధారణ పరీక్షలు మందులు ఉచిత వైద్య సలహాలు, సేవలు అందిస్తూ తల్లితండ్రులు పెట్టిన పేరును సార్ధకత చేస్తున్నారు డాక్టర్ తాత సేవ కుమార్.