డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు



Dr Karra Nagamalleswara Rao

ప్రధమ శిశు వైద్య నిపుణులు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అదిలాబాద్ జిల్లాలో ప్రధమ శిశు వైద్య నిపుణులు గా ప్రాక్టిస్ ప్రారంభించి నలుబది సంవత్సరాలనుండి నాలుగు తరాల వారికి అతి తక్కువ కన్సల్‍టెన్సీ ఫీ తో వైద్య సేవలు అందిస్తున్న బాల్య మిత్రులు డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు సామాన్య స్థితి నుండి ఉన్నత స్థాయి స్థితి లోకి ప్రవేశించిన విధానం తన ప్రధాన వృత్తి వైద్య సేవలకు ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్వహిస్తూ, ప్రవృత్తిగా వ్యవసాయం పై కూడా అవగాహన ఉన్నటువంటి జీవితాన్ని చూస్తుంటే ఓర్పు, కృషి, పట్టుదల, సమయపాలన లతో కూడిన అనేక పాత్రలను Balanced గా ఏ విధంగా నిర్వహించ గలుగుతున్నారు అని అనిపించక మానదు ఎవరికైనా.


క్లిష్టమైన పరిస్తితులను సయితం

సెల్ ఫోన్స్ లేని రెండు మూడు దశాబ్దాల క్రితం రిమోట్ ఏరియా లయిన అటవిక ప్రాంతాలలో, నక్సలైట్స్ సంచరించే అడవి గూడెం ప్రాంతాలలో, అర్ధ రాత్రులలో ఎడ్ల బండిపై క్లిష్టమైన పరిస్తితులను సయితం అధిగమించి గూడెం ప్రజల వద్దకు వెళ్ళి డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు ట్రీట్ మెంట్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు గా ఉన్నవి.


రహదారులు సరిగా లేని ప్రాంతాలను సహితం

జయపురం మండలం వెంకటాపురం అను అటవీ ప్రాంతంలో డయేరియా సోకి అక్కడి వారికి వైధ్యులు అందుబాటు లేని సమయాలలో అప్పటి ప్రభుత్వం వారి నుండి పంపే ల్యాండ్ ఫోన్ మెసేజ్ లకు స్పందించి తమ ఎపడమిక్ టీమ్ లతో జీప్ లలో బయలు దేరుతూ, రహదారులు సరిగా లేని ప్రాంతాలలో అక్కడి గూడెం ప్రజల సహకారాలతో ఎడ్ల బండ్లపై పయనిస్తూ బాధా తప్త రోగ గ్రస్తులకు సేవలు అంధించారు డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు.


నక్సలైట్స్ అభయాలు

అర్ధ రాత్రులలో అటవీ ప్రాంతాలలో సంచరించడంతో రెండు సందర్భాలలో నక్సలైట్స్ అడ్దగించి, మంచిర్యాల చుట్టుప్రక్కల గ్రామాలవారికి మంచి ప్రాక్టీషనర్ గా గుర్తింపులో ఉన్న డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు అని నక్సలైట్స్ తెల్సుకొని వైద్య సేవలు అందించాల్సిన గ్రామాలలోకి పంపించారు.


పిల్లల్లో వచ్చే తలసేమియా వ్యాధి

చిన్న పిల్లలకు వచ్చే ఒక రకమైన రక్త హీనత వంశ పారంపర్యంగా వస్తుంది, తల్లిదండ్రులు తలసేమియా వ్యాధి గ్రస్తులు అయితే. తలసేమియా వ్యాధి గ్రస్తులకు ప్రతి వారం లేదా ప్రతి పది రోజులకు బ్రతికున్నంత కాలం వాళ్ళకు బ్లడ్ ఎక్కిస్తూండాలి లేకపోతే చనిపోతుంటారు.


ఉచిత సేవలు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి సంస్థ వారి ఆధ్వర్యం లో నడుస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మరియు ట్రాన్స్‍ప్యూజన్ రీసెర్చ్ సెంటర్ వారి దగ్గర నమోదు కాబడిన 450 మంది తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు బ్లడ్ ఎక్కించడం, ట్రీట్ మెంట్ ఇవ్వడం వంటి సేవలు ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా ఉచితంగా అందిస్తున్నారు డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు.






తల్లిదండ్రులు

స్వర్గీయ శ్రీమతి కర్రా వరలక్ష్మి గారు, శ్రీ కర్రా శేష తల్ప సాయి గారు పుట్టుక ప్రభుత్వ హాస్పిటల్ తెనాలి లో 1954 వ సంవత్సరం ఆగస్ట్ 14 వ తేదీ


విద్యాభ్యాసం

ప్రాధమిక విద్య తెనాలి తాలుకా పెరుకలపూడి ఎలెమెంటరీ స్కూల్ లో, ఆరు నుండి పది తరగతులు 1969 సంవత్సరం వరకు మున్సిపల్ హైస్కూల్ నరసరావుపేటలో, ఇంటర్మీడియట్ 1969-1971 వరకు నరసరావుపేట SSN కళాశాల లో, M.B.,B.S., 1972 నుండి 1978 వరకు గుంటూరు మెడికల్ కాలేజ్ లో, PG పీడియాట్రిక్స్ కోర్సు గుంటూరు మెడికల్ కాలేజ్ లో 1980 నుండి 1982 వరకు చేసారు


స్టేట్ మెరిట్ స్కాలర్‌షిప్

చదువులలో అన్ని తరగతులలోను మెరిట్ లో మొదటి ఒకటి, రెండు స్థానాలలో ఉన్నారు. M.B.,B.S., కోర్సు సమయంలో గుంటూరు మెడికల్ కాలేజ్ లో స్టేట్ మెరిట్ స్కాలర్‌షిప్ కు ఎంపికయ్యారు. 10వ తరగతి మెరిట్ స్కూల్ పరిధిలో 3వ రాంక్ సాధించారు. కాలేజీ పరిధిలో మెరిట్ ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి రాంక్ లో రెండవ సంవత్సరం రెండవ రాంక్ సాధించారు. M.B.,B.S., కోర్సు గుంటూరు మెడికల్ కాలేజ్ లో మైక్రోబయాలజీలో మెరిట్ సర్టిఫికేట్ లభించింది. శస్త్రచికిత్స కు సంభందించి ఆప్తాల్మాలజీలో మెరిట్ సర్టిఫికేట్ సాధించారు.


కుటుంబం

వివాహితులు 1979 సంవత్సరంలో Guntur Medical College క్లాస్‌మేట్ శ్రీమతి డాక్టర్ సుబ్బలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. సంతానం ఒక కుమారుడు కోడలు, ఒక కుమార్తె అల్లుడు, మనవళ్ళు ఇద్దరు, మనవరాలు ఒకరు.


చిరంజీవి సౌభాగ్యవతి నీలిమ

కూతురు చిరంజీవి సౌభాగ్యవతి నీలిమ ప్రాధమిక విద్య L.K.G. నుండి పదవ తరగతి వరకు అరవింద్ ఆశ్రమం వారి మధర్ ఇంటర్నేషనల్ స్కూల్ న్యూ డెల్లీ లో BArch JNTU హైద్రాబాద్ లో చేశారు తదుపరి MS MBA పీజీ కోర్సులు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ లో చేసి, ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వం కు చెందిన జురాంగ్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు, MS (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చేసిన చిరంజీవి రోహిత్ ని వివాహం చేసుకున్నారు. అల్లుడూ తనేషియ బయోటెక్ పార్మసూటికల్ కంపెనీ సింగపూర్‌లో I T consaltant ఉద్యోగం చేస్తున్నారు.


చిరంజీవి శివ హర్ష

కుమారుడు చిరంజీవి శివ హర్ష పదవ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ లో, BE వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ లో తదుపరి మణిపాల్‌లోని TA పాయ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుండి M.B.A., చేశారు. మంచి రాంక్ తో 2013 లో సివిల్ సర్వీసెస్‌ కు సెలక్ట్ ఐ, IRTS వైజాగ్‌లో సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా Indian Raiways పనిచేసి ప్రస్తుతం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీగా న్యూ డెల్లీ లో పని చేస్తున్నారు. చిరంజీవి సౌబాగ్యవతి డాక్టర్ పోతరాజు రాధా కళ్యాణి ఎంఎస్ (జనరల్) ను వివాహం చేసుకున్నారు.


ప్రభుత్వ సర్వీసులు

బెల్లంపల్లిలోని సింగరేణి కాలరీల ఏరియా ఆసుపత్రిలో పని చేశారు, మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్స్ సర్వీసులలో పనిచేశారు.


అవార్డులు రివార్డులు

ఎపిడెమిక్ డయేరియా మలేరియా వైరల్ జ్వరాల నివారణ మరియు నియంత్రణలోను కుటుంబ నియంత్రణ కార్యకలాపల లోనూ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు గోదావరి పుష్కరాల సందర్భంగా అందించిన కుష్టు ఎయిడ్స్ కార్యక్రమాల సేవలకు గానూ ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ కార్యక్రమ అధికారిగా 5 సార్లు ప్రభుత్వం నుండి అవార్డులు అందుకున్నారు. ఉచిత సేవలకు గుర్తింపుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి సంస్థ వారి నుండి అనేక సార్లు అభినందన సర్టిఫికెట్స్ (appreciation certificate) పొందారు


సహాయ సహకారాలు

డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు విజయానికి సమయ పాలనకు కారణం తన సహచారిణి శ్రీమతి డాక్టర్ సుబ్బలక్ష్మి గారి పాత్ర శ్లాగనీయం వారి సహాయ సహకారాల వలననే అటు ప్రభుత్వ సర్వీస్ ల లోనూ ఇటు తమ క్లినిక్ లో ఉన్న పేషంట్స్ కు వైద్య సేవలందించడం సాధ్యమయినదని తెలియజేస్తున్నారు.


ఆత్మ తృప్తి తో అనుభవిస్తున్న ఆనందం

అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఒకసారి చూసి వారికి సేవ చేస్తే వారి ముఖంలో చిరునవ్వు మరియు ఆనందాన్ని చూడటం అత్యంత విలువైనది, అట్లానే ఎపిడెమిక్స్‌లో పనిచేసే పబ్లిక్ హెల్త్‌లో దాని నియంత్రణ మరియు నివారణ కోసం చాలా మంది ప్రాణాలను కాపాడటంలో ఉన్న సంతృప్తిని అది దేనితోనూ కొలవలేని ఆత్మ తృప్తి తో నేను అనుభవిస్తున్న ఆనందం వర్ణించలేనిది అని అంటున్నారు డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు.


సేవ చేయడం నా అదృష్టం

52 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిన నా తల్లికి సేవలు చేసే అవకాశం, గుండె ఊపిరితిత్తుల ఇతర వ్యాధులతో నా వృద్ధ తండ్రికి సేవలు చేస్తుండడం, ప్రజారోగ్య కార్యక్రమాల అమలులో అతి పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రతి మూలను సందర్శించడం, మా 40 సంవత్సరాల వైద్య వృత్తిలో అసంఖ్యాకమైన జబ్బుపడిన అత్యవసర చికిత్సలకు సేవలు అందించడం నా అదృష్టం గా భవిస్తున్నాను అది ప్రతి రోజూ నేను ఆచరిస్తున్న యోగా, మెడిటేషన్, భగవత్ ధ్యానంతో, భగవంతుని ఆశీర్వాదం వలన, సాధ్య మయిందని తెలియ జేస్తున్నారు డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు


అభినందనీయులు

పిడియాట్రిక్ హెల్త్ సేవలు, పబ్లిక్ హెల్త్ సేవలు, కుష్టు రోగులు, ఎయిడ్స్ రోగులు, వివిధ హెల్త్ కాంపస్ సేవలు నిర్వ హిస్తూ, ప్రతి శుక్రవారం మద్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వ్యవసాయ క్షేత్రంలో గడపటానికి, తాను ఏర్పర్చుకున్న సమయ పాలనను తుచ తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తూ అటు రోగులకు ఇటు ప్రభుత్వానికి ఎంతో కొంత తన వంతు కంట్రిబ్యూషన్ ఇస్తున్న సేవలతో సంత్రుప్తి చెందుతూ అనారోగ్యం నుండి ఆరోగ్య స్వస్తతలతో మారిన రోగులకు, వారి బంధువులకు తల్లిదండ్రులకు ఆనందాలు పంచుతున్న డాక్టర్ కర్రా నాగ మల్లేశ్వర రావు అభినందనీయులు.



బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Syed Naseer Ahamed
Dr Tata Seva Kumar
Dr Banda Jawahar
Mr Prasad Sarma
Mr Dasari Rama Muthy
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Nallapati Satyanarayana
Mr PV Uma Maheswara Rao
www.bandla.app Image
www.bandla.app Image
www.bandla.app Image